Site icon NTV Telugu

Minister Savitha: జగన్.. రౌడీ షీటర్లను పరామర్శించడం అంటే అరాచకాలను ప్రోత్సహించడమే..

Minister Savitha

Minister Savitha

జగన్ ఒక రంగుల రెడ్డి, జగన్ వి చీప్ పాలిటిక్స్.. తల్లిని, చెల్లిని మోసం చేసింది జగన్ అని మంత్రి సవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ఏపీని గంజాయి రాష్ట్రంగా మార్చారని… గత 5 ఏళ్లలో దళితులపై దాడులు ఎలా చేశారో చూశామన్నారు.. జగన్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి సవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ రౌడీ షీటర్ లను పరామర్శించడం అంటే అరాచకాలను ప్రోత్సహించడమేనన్నారు. జగన్ ఖబడ్దార్.. మీకు చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత లేదని మండిపడ్డారు.. అన్నమయ్య జిల్లాలో డ్యాం కొట్టుకుపోయి 42 మంది చనిపోతే ఎందుకు పరామర్శించ లేదని ప్రశ్నించారు. తల్లికి, చెల్లికి వెన్ను పోటు పొడిచింది నీవు కాదా? అని ప్రశ్నించారు. ప్రజలు మీకు ఎందుకు బుద్ధి చెప్పారో ఇప్పటికైనా తెలుసుకోండి.. మీ బాబాయిని చంపితే వాళ్ళకు ఎందుకు న్యాయం చేయలేదన్నారు…

READ MORE: Medical Assistance: హీరో ప్రభాస్, సోనూసూద్‌లు సాయం చేయాలంటూ పాదయాత్ర

ఎన్నికల హామీలు మీరు ఎన్ని అమలు చేసారో…చర్చ కు సిద్ధమా..? అని మంత్రి సవిత సవాల్ విసిరారు. “రైతులకు నీవు ఎలా మోసం చేశావో తెలుసు.. పింఛన్ ను 3 వేల నుండి 4 వేలు ఒకేసారి పెంచాం.. దేశంలో ఇంత పెద్ద ఎత్తున పించన్ ప్రభుత్వం ఎక్కడ ఉందో చూపించు… సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తున్నాం. జగన్ నీ భూ చట్టాలను రద్దు చేశాం.. నీ హయంలో ఎన్ని లక్షల ఎకరాలు అక్రమాలు చేశారో …ఇప్పుడు బయటికి వస్తున్నాయి.. రాయల సీమ ను అభివృద్ధి చేసింది చంద్రబాబు నాయుడు.. కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం ప్రారంభం కానుంది.. ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లు ధ్వంసం చేశారు.. నీవు అమ్మ ఒడి పథకం ద్వారా ఎంత మందికి ఇచ్చావు.. మేము తల్లికి వందనం క్రింద ఎంత మంది పిల్లలు ఉన్నా 15 వేలు ఇస్తున్నాం.. ల్యాండ్,వైన్, మైన్ లో అక్రమాలు చేశారు.” అని ఆమె వ్యాఖ్యానించారు..

READ MORE: IPL 2025 Final: సాయంత్రం 6 గంటలకే ఐపీఎల్ ముగింపు వేడుకలు..

Exit mobile version