Site icon NTV Telugu

Minister Satya Kumar Yadav: బడ్జెట్‌లో వైద్యారోగ్య శాఖకు కేటాయింపులపై మంత్రి సత్యకుమార్ యాదవ్ హర్షం

Satya Kumar

Satya Kumar

Minister Satya Kumar Yadav: ఈ బడ్జెట్ గత ఐదేళ్లలో జరిగిన దాన్ని సరిచేస్తూ ఇచ్చిన బడ్జెట్ ఇది అంటూ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. రూ.18,421 కోట్లతో వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖకు ఇచ్చారని వెల్లడించారు. గత బడ్జెట్ కంటే 23 శాతం ఎక్కువ ఆరోగ్యశాఖకు కేటాయించారన్నారు. విద్యాశాఖ తరువాత అత్యధికంగా కేటాయించడంతో ప్రజారోగ్యం పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధి తెలుస్తుందన్నారు. రూ. 4 వేల కోట్లు ఎన్టీఆర్ వైద్య సేవకు కేటాయించారన్నారు. మూలధన వ్యయం మీద ప్రధానంగా దృష్టి సారించారన్నారు.

Read Also: Gold Rate Today: మగువలకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధరలు!

గత ఐదేళ్లలో రూ.3970 కోట్లు లో 55 శాతం ఒక్కసారే కేటాయించడం ఈ ప్రభుత్వ దూరదృష్టి తెలుస్తుందన్నారు. కేంద్రం 17 మెడికల్ కాలేజీలు ఇస్తే.. మేమే చేశాం అని జగన్ అనడం‌పై సమాధానం చెప్పాలన్నారు. రూ.2100 కోట్లు మాత్రమే ఖర్చు చేసి, చేయని దానిని చేసినట్టు చెపుతున్నారన్నారు. 15వ ఫైనాన్స్ కమిషన్ నిధులు దారి మళ్ళించారన్నారు. వైద్య ఆరోగ్యశాఖ నిధులు కూడా దారి మళ్ళించారన్నారు. ఆరోగ్యమందిర్‌ల నిర్మాణాలు జరపలేదని విమర్శించారు. పేదల ప్రాణాలను గాల్లో దీపంలా మార్చి తగుదునమ్మా అని మాట్లాడటం సరికాదని మంత్రి అన్నారు.

Exit mobile version