Minister Satyakumar: రుయా ఆస్పత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి సత్యకుమార్

  • రుయా ఆస్పత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్
  • వైద్య ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా మార్చివేశారని విమర్శలు
Minister Satyakumar

Minister Satyakumar

Minister Satyakumar: తిరుపతిలోని రుయా ఆస్పత్రిని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు. వైద్య ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా మార్చివేశారని ఆయన విమర్శించారు. అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వాన్ని, నిధులను గత ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని ఆయన ఆరోపించారు. భవిష్యత్తులో నిరంతరంగా రెగ్యులర్ తనిఖీలు ఉంటాయన్నారు. గత ప్రభుత్వం చేసిన నిర్వాకంతో సామాన్యులకు వైద్య సేవలు అందని పరిస్థితి ఏర్పడిందన్నారు.

Read Also: Gummadi Sandhya Rani: గిరిజన ప్రాంతాల్లో తాగు నీరు, విద్య మా ప్రథమ ప్రాధాన్యం..

సీఎం చంద్రబాబు నేతృత్వంలో కేంద్రం నుంచి నిధులు రాష్ట్రం నుంచి సమన్వయ నిధులు కలిపి ఆసుపత్రులను అభివృద్ధి చేస్తామన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి క్యాన్సర్ స్క్రీనింగ్ చేయడానికి ఒక కార్యక్రమం ప్రారంభిస్తున్నామన్నారు. త్వరలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. గత పాలకులు రిషికొండలో విలాసవంతమైన భవనాలు తాడేపల్లిలో ప్రభుత్వ వ్యయంతో రహదారుల నిర్మాణాలు చేసుకొని విలాసవంతమైన జీవితం అనుభవించారని విమర్శించారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే రేణిగుంట నుంచి తిరుపతి రావడానికి కూడా ప్రత్యేకంగా హెలికాప్టర్‌ను వాడారన్నారు. అంటే ప్రభుత్వ ధనాన్ని ఎంత దుర్వినియోగం చేశారో అర్థమవుతుందన్నారు.