తిరుపతిలోని రుయా ఆస్పత్రిని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు. వైద్య ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా మార్చివేశారని ఆయన విమర్శించారు. అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వాన్ని, నిధులను గత ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని ఆయన ఆరోపించారు.
ఆనందంగా నిర్వహించుకోవాల్సిన సంక్రాంతి సంబురాలు ఆ ముగ్గురి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపాయి. చిత్తూరు జిల్లా మదనపల్లిలోని ఐదోమైలు వద్ద రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… వాల్మీకి పురం మండలం చింతపర్తి, మదనపల్లె మండలం కొత్తవారి పల్లెకు చెందిన వ్యక్తులు రెండు ద్విచక్ర వాహనాలపై ప్రయాణిస్తుండగా ఎదురెదురగా వచ్చి ఢీకొట్టడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. నిన్న రాత్రి ఈ ఘటన జరగింది. వారిని వెంటనే తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ…