కేజి టు పిజి అనేది రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ స్వప్నం అని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పాలమాకుల గ్రామంలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం, జూనియర్ కళాశాల ప్రారంభోత్సవానికి హాజరైన మంత్రి మాట్లాడారు. ప్రతి పేద విద్యార్దికి మంచి విద్యనందించాలనే ముఖ్యమంత్రి ఆలోచన అని తెలిపారు. రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఉన్నత విద్యారంగంలో అనేక సంస్కరణలు తెచ్చామన్నారు.
Read Also:AP Assembly: అసెంబ్లీ సమావేశాల తొలిరోజే మూడు రాజధానులపై చర్చ..?
తెలంగాణ వచ్చాక స్కూల్, కాలేజ్, టెక్నికల్, ఐటిఐ అన్ని రంగాల్లో మార్పులు తీసుకొస్తున్నారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా గురుకులాలు ఏర్పాటు చేస్తున్నారని ఆమె అన్నారు. దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తూ విద్యార్దులందరు గురుకులాల్లో అడ్మిన్ కోసం చూస్తున్నారని తెలిపారు. గురుకులంలో పదో తరగతి వరకే కాకుండా ఉన్నత విద్య నందించాలనే ఉద్దేశంతో జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మేల్సీ వాణిదేవి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, జెడ్పీ ఛైర్మన్ అనితా రెడ్డి పాల్గోన్నారు.
Read Also: Case on Corporator Narsimha Reddy: మన్సురాబాద్ కార్పొరేటర్ నర్సింహారెడ్డిపై కేసు