ఏపీలో జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై మంత్రి ఆర్ కె రోజా హాట్ కామెంట్స్ చేశారు. జగన్ ను ఎవరు వ్యతిరేకిస్తే వారికే నష్టం, జగన్ కు కాదు. జగన్ చరిష్మాతో వీరంతా ఎమ్మెల్యేలుగా గెలిచారు. చంద్రబాబు వైస్రాయ్ రాజకీయాలను ఇప్పటికీ సిగ్గులేకుండా కొనసాగిస్తున్నారు. చంద్రబాబును తరిమికొట్టాలని ప్రజలకు పిలుపు ఇస్తున్నా అన్నారు. ఎన్టీఆర్, కిరణ్ కుమార్ రెడ్డి సీఎంలుగా ఉన్నపుడు జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నపుడు ఎమ్మెల్యేలను కొన్న వ్యక్తి చంద్రబాబు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇద్దరు ఎమ్మెల్యేలను చంద్రబాబు కొన్నారు.
Read Also: April 28th: అదీ… ఏప్రిల్ 28 సెంటిమెంట్!
అందుకే 2024 ఎన్నికల్లో చంద్రబాబుకి రెండు ఎమ్మెల్యే సీట్లు కూడా రావు. క్రాస్ ఓటింగ్ వేసిన ఎమ్మెల్యేల భవిష్యత్ ఏంటో త్వరలో తెలుస్తుంది. ఎమ్మెల్యే సీట్లు రాని వారు వెళ్ళారు, వారి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేసినవారిపై చర్యలు తప్పవన్నారు. ఇదిలా ఉంటే నిన్న శాసనసభలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల పై మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడారు. క్రాస్ ఓటింగ్ కు పాల్పడిన వారిని గుర్తించాం..నలుగురి పై పార్టీలో విశ్లేషణ చేసి కఠిన చర్యలు తీసుకుంటాం..చంద్రబాబు నీచ రాజకీయాలను నమ్మి వెళ్లిన నలుగురికి రాజకీయ భవిష్యత్తు ఉండదు..మా బలంతో మేము గెలిచాము, చంద్రబాబును నమ్మి నాడు వెళ్లిన 23 మంది పరిస్థితి ఏమైంది..వచ్చే ఎన్నికల్లో 175 కు 175 స్దానాలు గెలుచుకుని తీరుతాం అని ధీమా వ్యక్తం చేశారు.
ఎన్టీవీతో ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడారు. ప్రజలతో సంబంధం లేని ఎన్నిక ఇది. రాజకీయాలుగా మాత్రమే ఈ ఎన్నికను చూడాలి. టీడీపీ చెబుతున్నట్టు ప్రజాస్వామ్య విజయం కాదు. మాతోనే ఉండి సొంత పార్టీకి వెన్నుపోటు పొడిచిన వారిపై కటిన చర్యలు ఉంటాయి. ఇప్పటికే అధిష్టానం విప్ కి వ్యతిరేకంగా ఓటు ఎవరు వేశారో గుర్తించింది. వైసీపీ ఫెయిర్ పాలిటిక్స్ చేస్తుంది. చంద్రబాబుకి మొదటి నుంచి కుట్రలు, కుతంత్రాలు చేయటం అలవాటు అని మండిపడ్డారు.
Read Also: Post Office Scheme: రోజుకు రూ.333 పెడితే.. రూ.16లక్షలు మీవే