April 28th: అదీ… ఏప్రిల్ 28 సెంటిమెంట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సెంటిమెంట్స్ కు నిలయం సినిమా రంగం! తెలుగు చిత్రసీమలో ఏప్రిల్ 28వ తేదీకి ఓ ప్రత్యేకత ఉంది. ఆ తేదీన విడుదలయ్యే భారీ చిత్రాలు తప్పకుండా ఘనవిజయం సాధిస్తాయని చాలామందిలో ఓ సెంటిమెంట్ నెలకొంది. అంతేకాదు, ఆ తేదీన విడుదలైన చిత్రాలు ఏదో విధంగా ప్రత్యేకతను సంతరించుకున్నవే కావడం విశేషం! ఈ ‘ఏప్రిల్ 28’ వతేదీకి అంత క్రేజ్ సంపాదించి పెట్టిన ఘనత యన్టీఆర్, కె.రాఘవేంద్రరావు కాంబినేషన్ లో రూపొందిన తొలి చిత్రం ‘అడవిరాముడు’కే చెందుతుంది. ఈ సినిమా 1977 ఏప్రిల్ 28న విడుదలై సంచలన విజయం సాధించింది. ఈ నాటికీ పలు చెరిగిపోని, తరిగిపోని రికార్డులు నెలకొల్పింది. ఈ చిత్రానికి సరిగా ఓ యేడాది ముందు కె.రాఘవేంద్రరావు తండ్రి కె.యస్.ప్రకాశరావు దర్శకత్వంలో ఏయన్నార్ హీరోగా రూపొందిన ‘సెక్రటరీ’ సినిమా రిలీజ్ అయింది. 1976 ఏప్రిల్ 28న విడుదలైన ‘సెక్రటరీ’ ప్రత్యేకత ఏమిటంటే- అన్నపూర్ణ స్టూడియోస్ లో నిర్మితమైన తొలి చిత్రం’సెక్రటరీ’. ఇప్పుడు మళ్ళీ ఆ తేదీని ఎందుకు గుర్తు చేసుకుంటున్నామంటే, ఓ భారీ విజయం కోసం ఎదురుచూస్తోన్న అక్కినేని మనవడు అఖిల్ నటించిన తాజా చిత్రం ‘ఏజెంట్’ ఈ యేడాది అదే ఏప్రిల్ 28న విడుదలవుతోంది.
ఒక్క ‘అడవిరాముడు’ ఘనవిజయంతోనే ఏప్రిల్ 28కి ప్రత్యేకత వచ్చిందా? ఆ తేదీన విడుదలై విజయఢంకా మోగించిన ఇతర చిత్రాలు లేవా? ఉన్నాయ్. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలోనే కృష్ణ, కృష్ణంరాజు హీరోలుగా రూపొందిన ‘అడవిసింహాలు’ 1983 ఏప్రిల్ 28న విడుదలైంది. ఇదే చిత్రాన్ని హిందీలో రాఘవేంద్రరావు దర్శకత్వంలోనే ధర్మేంద్ర, జితేంద్ర హీరోలుగా ఏకకాలంలోనే ‘జానీదోస్త్’గా రూపొందించారు. ఆ సినిమా కూడా అదే తేదీకి వెలుగు చూసింది. సి.అశ్వనీదత్ నిర్మించిన ‘అడవిసింహాలు’ ఆ రోజుల్లో భారీ ఓపెనింగ్స్ చూసిన సినిమాగా నిలచింది. ఇక 2006లో ఏప్రిల్ 28న విడుదలైన మహేశ్ బాబు ‘పోకిరి’ చిత్రం కూడా తరిగిపోని,చెరిగిపోని రికార్డులు సృష్టించింది. ‘అడవిరాముడు’ విడుదలైన సరిగా 40 ఏళ్ళకు అంటే 2017లో ఏప్రిల్ 28న రాజమౌళి రూపొందించిన ‘బాహుబలి-2’ విడుదలయింది. ఈ చిత్రానికి కె.రాఘవేంద్రరావు సమర్పకులు కావడం గమనార్హం! ఈ నాటికీ ‘బాహుబలి-2’ టాప్ గ్రాసర్ గా నిలచే ఉంది. ఇలా పలు ఘనవిజయాలు విడుదలైన ఏప్రిల్ 28వ తేదీనే అఖిల్ ‘ఏజెంట్’గా వస్తున్నాడు. అదే రోజున మణిరత్నం ‘పొన్నియిన్ సెల్వన్-2’ విడుదలవుతోంది. మరి ఈ సినిమాలకు ఏప్రిల్ 28వ తేదీ ఏ తీరున కలసి వస్తుందో చూడాలి.
Also Read
- Dhanush Secret: ప్రపంచానికి తెలియని ధనుష్ సీక్రెట్ లీక్ చేసిన శ్రీలీల!
- OM Pre Release Event: ఇన్నాళ్లూ వచ్చిన సినిమాలు చేసుకుంటూ వెళ్లా, కానీ ఇప్పుడు రూట్ మార్చా.. శ్రీలీల ఓపెన్ కామెంట్స్!
- Renu Desai: 'ఓం' ప్రీరిలీజ్ ఈవెంట్లో ధనుష్‌కు సారీ చెప్పిన రేణు దేశాయ్.. ఎందుకంటే?
- Janta Movie: మెగా హీరో 'జంట' సెన్సేషనల్ క్యాప్షన్ వెనుక అసలు కథ ఇదే!!
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day 3: అంగరంగ వైభవంగా కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వరస్వామి కల్యాణం.. మూడో రోజు విశేషాలివే..
-
Dhanush Secret: ప్రపంచానికి తెలియని ధనుష్ సీక్రెట్ లీక్ చేసిన శ్రీలీల!
-
OM Pre Release Event: ఇన్నాళ్లూ వచ్చిన సినిమాలు చేసుకుంటూ వెళ్లా, కానీ ఇప్పుడు రూట్ మార్చా.. శ్రీలీల ఓపెన్ కామెంట్స్!
-
Renu Desai: ‘ఓం’ ప్రీరిలీజ్ ఈవెంట్లో ధనుష్‌కు సారీ చెప్పిన రేణు దేశాయ్.. ఎందుకంటే?
-
Telangana Govt: కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. గృహ నిర్మాణ పథకం లబ్ధిదారులకు ఊరట..
ట్రెండింగ్
-
Gully Cricket: సచిన్ టెండూల్కర్‌తో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం, కేట్..!
-
Mohit Ulva: ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.. ఎవరీ మోహిత్ ఉల్వా.. జడేజా కోచ్ దగ్గరే శిక్షణ!
-
ICC Chairman-Jay Shah: రెండోసారి ఐసీసీ చైర్మన్‌గా జై షా.. ఈసారి కూడా ఏకగ్రీవమే!
-
Vaibhav Sooryavanshi: సచిన్ టెండూల్కర్ అవుతాడో లేక వినోద్ కాంబ్లీ అవుతాడో చెప్పడం కష్టం..!
-
India Schedule: రోహిత్, కోహ్లీ మళ్లీ ఆడేది అప్పుడే.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఇదిగో..!