Minister RK Roja: 2024 ఎన్నికల్లో జగన్ గెలుపు ఎవరూ ఆపలేరు.. నాన్‌లోకల్ పొలిటిషన్స్‌ను ఎవరూ పట్టించుకోరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister RK Roja: 2024 ఎన్నికల్లో సీఎం వైఎస్ జగన్ గెలుపును ఎవరూ ఆపలేరు అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు మంత్రి ఆర్కే రోజా.. విజయవాడలోని బాపు మ్యూజియంలో పురావస్తు శాఖ ఆధ్వర్యంలో లేజర్, సౌండ్ లైట్ షోను ఎంపీ కేశినేని నాని, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో కలిసి ప్రారంభించిన ఆమె.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. షర్మిల రాష్ట్ర రాజకీయాల్లోకి సంక్రాంతికి వచ్చే డూడూ బసవన్నల మాదిరి వచ్చారు అని సెటైర్లు వేశారు. స్ధానికత లేని పార్టీలను ప్రజలు నమ్మరు. పక్క రాష్ట్రంలో పార్టీ తీసేసి, ఇక్కడికొచ్చి మాట్లాడితారు.. జగనన్నకు ఇక్కడ అడ్రస్, గుర్తింపు, ఓటు అన్నీ ఉన్నాయి.. వైఎస్సార్ అభిమానులంతా సీఎం వైఎస్ జగన్ వెంటే ఉన్నారు.. ఉంటారు అని ధీమా వ్యక్తం చేశారు.
Read Also: Top Headlines @ 9 PM : టాప్ న్యూస్
Also Read
- Hyderabad: డ్రగ్స్ కలకలం.. ఎమ్మెల్సీ కుమారుడితో సహా ముగ్గురు అదుపులో, నలుగురు పరారీ..!
- 50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్‌లో లాంచ్..!
- 144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్‌లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
- Guntur: కన్న కొడుకును చంపిన తల్లిదండ్రులు.!
ఇక, షర్మిల లాంటివారిని రాష్ట్ర ప్రజలు ఆదరించరు.. తెలంగాణ ప్రజలు ఛీ కొడితే ఏపీలోకి షర్మిల వచ్చారు అని ఎద్దేవా చేశారు రోజా.. సామాజిక న్యాయానికి సీఎం జగన్మోహన్ రెడ్డి పెద్ద పీట వేస్తున్నారు.. జగన్ పాలనపై రాష్ట్ర ప్రజలంతా సంతృప్తిగా ఉన్నారు.. గతంలో ఎప్పుడూ లేని అభివృద్ధి రాష్ట్రంలో కనిపిస్తుంది.. విజయవాడ నగరంలో అంబేద్కర్ భారీ విగ్రహం, బాపూ మ్యూజియం, భవాని ఐలాండ్ వంటి పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేశామని వెల్లడించారు. 2024 ఎన్నికల్లో జగన్ గెలుపు ఎవరూ ఆపలేరు.. నాన్ లోకల్ పొలిటిషియన్స్ ఇక్కడ ఉండరు.. పట్టించుకోరు.. రాజన్న బిడ్డగా ప్రజలకు రాజన్న రాజ్యం అందించడానికి జగన్ కాంప్రమైజ్ కాలేదన్నారు. ఏపీలో ఓటు అడిగే నైతిక అర్హత కాంగ్రెస్ కి లేదన్నారు.. రాష్ట్రాన్ని విడగొట్టి, వైఎస్ఆర్ పేరు ఎఫ్ఐఆర్ లో పెట్టింది కాంగ్రెస్ పార్టీ అని మండిపడ్డారు. ప్రత్యేక హోదా ప్రకటించకుండా ఒక రూమ్‌లో కూర్చొని రాష్ట్రాన్ని విడగొట్టారు.. కాంగ్రెస్ తరఫున ఎవరొచ్చిన పిచ్చోళ్లవుతారు.. వాగే నోర్లకి 2024 సమాధానం చెబుతుందని ధీమా వ్యక్తం చేశారు మంత్రి ఆర్కే రోజా..
తాజావార్తలు
-
Fauzi Release Date : ‘ఫౌజీ’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. డిసెంబర్లో థియేటర్స్ దద్దరిల్లాల్సిందే
-
Doctor Murder Case: రక్తపు మడుగులో భర్త.. 8ఏళ్ల పిల్లాడిని చావబాదింది.. తర్వాత మంచంపై పడుకొని ఫోన్లో రీల్స్ చూస్తూ…
-
Tollywood : డాన్సర్స్ అసోసియేషన్ వివాదంపై ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం
-
Siya Goyal: సియా గోయల్ కుటుంబానికి FDA షాక్.. రూ.8 లక్షల విలువైన వస్తువుల స్వాధీనం
-
Diljit Dosanjh: రూ.1 రెమ్యునరేషన్ తీసుకున్న స్టార్ హీరో.. షాకింగ్ నిజం బయటపెట్టిన దర్శకుడు
ట్రెండింగ్
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్‌లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్‌లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!