టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై తీవ్ర విమర్శలు చేశారు మంత్రి ఆర్ కె రోజా. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు సంధించారు. చంద్రబాబును రెండు రాష్ట్రాల ప్రజలు తిరస్కరించారు. ఆంధ్రాలో ప్రతిపక్షంగా కూడా ఉండలేక ఖమ్మం వెళ్లి మాట్లాడుతున్నారు. సీఎం జగన్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు తట్టుకోలేక తెలంగాణలో పార్టీ పెట్టాలనుకుంటున్నారేమో అన్నారు రోజా. ఖమ్మం నా గుమ్మం అన్నారు… మీకు జీవితాన్నిచ్చిన కుప్పం ప్రజలకు ఏం చెబుతారు? అని మంత్రి రోజా ప్రశ్నించారు.
Read Also: Niranjan Reddy: కల్లాలు కట్టడం నేరమా..? తెలంగాణపై కేంద్రం కక్ష కట్టింది.
చంద్రబాబుకు మతిభ్రమించింది. సెల్ ఫోన్ నేనే కనిపెట్టాను అని చంద్రబాబు అంటాడు. నిన్న ఏకంగా కరోనాకు వ్యాక్సిన్ నేనే కనిపెట్టాను అన్నాడు… ఇన్ని కనిపెట్టిన చంద్రబాబుకు కొడుకు లోకేష్ ను గెలిపించుకోడం తెలియదా? అని రోజా హేళన చేశారు. ఖమ్మంలో సభపై ఇటు వైసీపీ నేతలు, అటు బీఆర్ఎస్ నేతలు విరుచుకుపడుతున్నారు. తెలంగాణ మంత్రి హరీష్ రావు చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏపీలో చెల్లని రూపాయి.. తెలంగాణలో చెల్లుతుందా? అంటూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆర్థిక మంత్రి హరీశ్‌రావు సెటైర్లు వేశారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి, అభివృద్ధి చేయలేక అక్కడి ప్రజల చేతుల్లో ఛీత్కారానికి గురై ఇప్పుడు తెలంగాణను అభివృద్ధి చేస్తాననడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. . ఏపీ ప్రజలే పాలన బాగాలేదని చిత్తుచిత్తుగా ఓడించి వెళ్లగొడితే.. ఇక్కడికి వచ్చి ఏం చేస్తారన్నారు హరీష్ రావు.నల్లగొండలో ఫ్లోరోసిస్‌ను పారద్రోలింది తానేనని చంద్రబాబు అంటున్నాడని, ఇంతకన్నా పెద్ద జోక్ ఉందా? అని ప్రశ్నించారు బీఆర్ఎస్ నేతలు.
Read Also: Gandhi Bhavan Hitension: డిగ్గీరాజా సాక్షిగా గాంధీభవన్ లో డిష్యుం డిష్యుం
