Rammohan Naidu: మిర్చి రైతులను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాం.. రూ.11,600కు పైగా మద్దతు ధర ఇవ్వాలని కోరాం!
- శివరాజ్ సింగ్ చౌహన్తో రామ్మోహన్ నాయుడు భేటీ
- మిర్చి రైతులను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాం
- రైతుల కష్టం తెలిసిన వ్యక్తి శివరాజ్ సింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా మిర్చి రైతులను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాం అని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఏపీలోని మిర్చి రైతులను ఆదుకోవాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌ను కోరామమన్నారు. మిర్చికి రూ.11,600 పైగా మద్దతు ధర ఇవ్వాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేశామన్నారు. మార్కెట్ రేటుకు, రైతుల పెట్టుబడి వ్యయానికి మధ్య ఉన్న గ్యాప్‌ను కేంద్రం నుంచి నిధులు తెచ్చి ఆదుకోవాలని చూస్తున్నాం అని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.
ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్తో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మంత్రి అచ్చం నాయుడు, ఏపీ వ్యవసాయ శాఖ అధికారులు వర్చువల్‌గా హాజరయ్యారు. సమావేశం అనంతరం రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ… ‘మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా రైతులను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాం. మిర్చి ఉత్పత్తి వ్యయాన్ని రాష్ట్రం రూ.11,600 రూపాయలుగా నిర్ణయించింది. అంతకంటే ఎక్కువ మొత్తంలో రైతులకు మేలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. గతంలో మాదిరిగా ఇప్పుడు మిర్చి ఎగుమతులు జరగడం లేదు. మిర్చి ఎగుమతులు పెంచడం గురించి కూడా ఇవాళ్టి సమావేశంలో చర్చించాం. రాష్ట్రంలో మిర్చి రైతులు, ఎగుమతిదారులతో సదస్సు పెట్టాలని నిర్ణయించాం. సదస్సు ద్వారా వచ్చిన సలహాలు, సూచనల ఆధారంగా మిర్చి ఎగుమతులు పెంచడంపై దృష్టి పెడతాం’ అని చెప్పారు.
Also Read
- Tamil Nadu: అన్నాడీఎంకేకు బిగ్ షాక్.. ముగ్గురు ఎమ్మెల్యేలు టీవీకేలో చేరిక
- Venkatesh Iyer: సడన్‌గా వెంకటేశ్ అయ్యర్‌కు హైప్.. తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో కోహ్లీతో ఓపెనర్‌గా రంగంలోకి..
- Chandrababu: ప్రపంచానికే డేటా హబ్‌గా విశాఖ తయారవుతోంది
- Vaibhav Sooryavanshi: క్రిస్ గేల్ రికార్డు నాకు లెక్క కాదు.. టీ20ల్లో 200 కొట్టి చూపిస్తా: వైభవ్ సూర్యవంశీ
‘మిర్చి రైతుల ఆదాయం ఎలా పెంచాలన్నదే అందరం ఆలోచిస్తున్నాం. సీఎం చంద్రబాబు నాయుడు నేరుగా ఈ అంశాన్ని కేంద్రం దృష్టికి తెచ్చారు. రైతుల కష్టం తెలిసిన వ్యక్తి కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. నిన్న ఢిల్లీలో లేనప్పటికీ మధ్యప్రదేశ్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏపీ సీఎంతో మాట్లాడారు. ఈరోజు ఢిల్లీ వచ్చిన వెంటనే అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి చర్చించారు. మార్కెట్ రేటుకు, రైతుల పెట్టుబడి వ్యయానికి మధ్య ఉన్న గ్యాప్‌ను కేంద్రం నుంచి నిధులు తెచ్చి ఆదుకోవాలని చూస్తున్నాం. ఉత్పత్తి వ్యయం రూ.11,600 కంటే ఎక్కువగా నిర్ణయించాలని ICARను కోరాం’ అని రామ్మోహన్ నాయుడు చెప్పారు.
తాజావార్తలు
-
Ropeway Stops Mid-Air: గాలిలో ఉండగానే అకస్మాత్తుగా ఆగిపోయిన రోప్‌వే.. చిక్కుకుపోయిన వందలాది మంది పర్యాటకులు
-
Shiva Rajkumar: రామ్‌చరణ్‌కు నేషనల్ అవార్డ్ పక్కా.. ‘పెద్ది’పై కన్నడ సూపర్ స్టార్ శివన్న సంచలన వ్యాఖ్యలు!
-
Tamil Nadu: అన్నాడీఎంకేకు బిగ్ షాక్.. ముగ్గురు ఎమ్మెల్యేలు టీవీకేలో చేరిక
-
Ram Charan : రామ్ చరణ్ తన బాడీగార్డ్‌కు రోజుకు ఎంత ఇస్తున్నాడో తెలుసా ?
-
Venkatesh Iyer: సడన్‌గా వెంకటేశ్ అయ్యర్‌కు హైప్.. తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో కోహ్లీతో ఓపెనర్‌గా రంగంలోకి..
ట్రెండింగ్
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?