Minister Ponnam Prabhakar: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో మంత్రి పొన్నం ప్రభాకర్ భేటీ
- కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశం
- రాష్ట్రానికి సంబంధించి పలు అనుమతుల కోసం మంత్రి విజ్ఞప్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Ponnam Prabhakar: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించి పలు అనుమతుల కోసం మంత్రి విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో రవాణా శాఖ వాహనాల రిజిస్ట్రేషన్లను వాహన్ పోర్టల్‌కు, డ్రైవింగ్ లైసెన్సులు సారథి పోర్టల్‌కు మార్చడం, వాహన స్క్రాపింగ్ సౌకర్యాల ఏర్పాటు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చిల్డ్రన్ ట్రాఫిక్ అవేర్‌నెస్ పార్కుల ఏర్పాటు రోడ్డు భద్రత అవగాహన ప్రచారాలను నిర్వహించడం వంటి అనేక కార్యక్రమాలు చేపడుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్ర మంత్రికి తెలిపారు. రెండు రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీ (RVSF) కేంద్రాలు ఇప్పటికే ఆమోదించబడ్డాయి. 37 (ముప్పై ఏడు) ఆటోమేటెడ్ వెహికల్ ఫిట్‌నెస్ టెస్టింగ్ స్టేషన్‌లను ఏర్పాటు చేయడానికి పరిపాలనా అనుమతి ఇవ్వబడింది. ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించడానికి, తెలంగాణ రాష్ట్రంలో కొనుగోలు చేసిన, రిజిస్టర్ చేయబడే వివిధ రకాల ఎలక్ట్రిక్ వాహనాలకు 100 శాతం రోడ్డు పన్ను, రిజిస్ట్రేషన్ ఫీజులను మినహాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
కేంద్ర ప్రభుత్వం మద్దతు కోసం విజ్ఞప్తి చేసిన అంశాలు ఇవే:
Also Read
- AP Economic Growth: ఏపీకి గుడ్ న్యూస్.. ఎల్‌నినో ప్రభావం ఉన్నా ఆర్థిక వృద్ధిలో దూకుడు..
- Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
- Delhi Alert: రెడ్‌ఫోర్ట్ నుంచి మెట్రో స్టేషన్ల వరకు నిఘా.. ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం.. 19 మంది ఉగ్రవాదుల పోస్టర్లు విడుదల..
- Government Schools Decline: ఒకే ఏడాదిలో 9,900 ప్రభుత్వ పాఠశాలల మూత... తెలుగు రాష్ట్రాల్లో భారీగా..! కారణమేంటి?
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో ఇటీవల 40 ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించామని, అక్కడ ఈ కింది వాటికి అనుమతి ఇవ్వాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్ర మంత్రిని కోరారు. ఢిల్లీలోని IDTR తరహాలో 15వ ఫైనాన్స్ కమిషన్ కింద హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియాలో డ్రైవర్లకు చాలా శిక్షణ అవసరం ఉన్నందున ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ (IDTR) ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కోరారు. బహుళ-లేన్ ఆటోమేటిక్ వెహికల్స్ ఫిట్‌నెస్ టెస్టింగ్ స్టేషన్‌ను నిర్మించడానికి అనుమతి ఇవ్వాలన్నారు. రోడ్ సేఫ్టీ కోసం పబ్లిక్ వాహనాల పర్యవేక్షణ కోసం ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు. హైదరాబాద్ ప్రాంతంలో ఎలక్ట్రానిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అమలు కోసం, ఈ-చలాన్‌ల ఆటో జనరేషన్ ద్వారా జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులను గుర్తించాలని విజ్ఞప్తి చేశారు.
Read Also: Telangana: రేపటి నుంచి రైతు పండుగ.. రైతులకు అవగాహన కల్పించేలా వేడుకలు
వాహన్ & సారథి సాఫ్ట్‌వేర్‌లకు బదిలీ చేయడం – డిపార్ట్‌మెంట్ వాహనం డేటాను NIC నిర్వహించే నేషనల్ రిజిస్టర్‌కి పోర్ట్ చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే NIC ద్వారా వాహన్/సారథి అమలుకు అనుమతిని ఇచ్చింది. దీని కోసం ప్రత్యేక బృందాన్ని ఉంచాలని NICని ఆదేశించవచ్చు, తద్వారా పోర్టింగ్ వేగంగా డేటాను కోల్పోకుండా చేయవచ్చన్నారు. MVIలు, AMVIలకు నాణ్యమైన సాంకేతికంగా ఫీల్డ్ శిక్షణ ఇవ్వడానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల స్థాపనకు భారీ డిమాండ్ మరియు ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతున్న సాంకేతికతను దృష్టిలో ఉంచుకుని సహకరించాలన్నారు. అందుబాటులో ఉన్న 21 డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్‌లను ఆటోమేట్ చేయడానికి మద్దతు అవసరమన్నారు. పారదర్శకంగా, సాంకేతికతతో నడిచే వేగవంతమైన పరీక్ష కోసం 21 డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్స్ ఏర్పాటు చేయాలని కోరారు. అంతే కాకుండా తన నియోజకవర్గం హుస్నాబాద్ లో పలు సింగిల్ రోడ్లను డబుల్ రోడ్లు గా విస్తరించేందుకు నిధులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. ఈ సమావేశంలో మంత్రితో పాటు ఎంపీలు మల్లు రవి, బలరాం నాయక్,రఘురామ్ రెడ్డి,గడ్డం వంశీ కృష్ణ, సురేష్ షెట్కార్ పాల్గొన్నారు.
న్యూఢిల్లీ లో తెలంగాణ ఎంపీలతో కలిసి
కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కారీ గారిని మర్యాద పూర్వకంగా కలవడం జరిగిందితెలంగాణ లో జాతీయ రహదారులు మరియు రైల్వే అండర్ రోడ్ బ్రిడ్జి పెండింగ్ పనులు తదితర అంశాలపై నితిన్ గడ్కారీ తో చర్చించడం జరిగింది @nitin_gadkari… pic.twitter.com/fMK0uH3KoB
— Ponnam Prabhakar (@Ponnam_INC) November 27, 2024
తాజావార్తలు
-
AP Economic Growth: ఏపీకి గుడ్ న్యూస్.. ఎల్‌నినో ప్రభావం ఉన్నా ఆర్థిక వృద్ధిలో దూకుడు..
-
Janhvi Kapoor: జాన్వీ కపూర్ ఓటీటీ ఎంట్రీ.. పా.రంజిత్ షో రన్నర్‌గా తమిళ సిరీస్!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Rahul Sipligunj : స్నేహితుడు ప్రేమ వ్యవహారంలో రాహుల్ సిప్లిగంజ్‌పై కేసు.. విశాఖలో FIR నమోదు
-
Delhi Alert: రెడ్‌ఫోర్ట్ నుంచి మెట్రో స్టేషన్ల వరకు నిఘా.. ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం.. 19 మంది ఉగ్రవాదుల పోస్టర్లు విడుదల..
ట్రెండింగ్
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
-
890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?
-
64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!