Minister Ponguleti Srinivas Reddy: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పడిపోలేదని.. చంద్రబాబు రాగానే ఏపీకి పోతుంది అనేది ప్రచారం మాత్రమేనని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. అమరావతిలో వరద వల్ల ఏపీకి ఇన్వెస్ట్మెంట్ వెళ్లే పరిస్థితి లేదన్నారు. అమరావతిలో వరద వల్ల ఇన్వెస్ట్మెంట్ పెట్టే వాళ్లకు భయం పట్టుకుందని మంత్రి అన్నారు. మీడియా చిట్‌చాట్‌లో మంత్రి మాట్లాడారు. హైదరాబాద్ – బెంగుళూరుకు ఇన్వెస్టర్లు వస్తున్నారన్నారు. హైడ్రా భయం ప్రజల్లో మాత్రం లేదన్న ఆయన.. మొదట్లో తప్పుడు ప్రచారం జరిగినా ఇప్పుడు నిజం తెలిసిందన్నారు.
అప్పులపై కేటీఆర్, బీఆర్‌ఎస్ నిజాలు తెలుసుకోవాలన్నారు. కార్పొరేషన్ లోన్స్‌తో కలిపి మొత్తం లెక్కలను బీఆర్‌ఎస్ వాళ్లు బయటపెట్టాలన్నారు. కార్పొరేషన్ పేరుతో చేసే అప్పులు సైతం ప్రభుత్వం ఖాతాలోకి వస్తాయి అనేది కేటీఆర్ తెలుసుకోవాలన్నారు. 7లక్షల 20వేల కోట్లు తెలంగాణ రాష్ట్రానికి అప్పులు ఉన్నాయన్నారు. శాసన సభలో ఎవరి పాత్ర వారిదే.. ప్రివిలేజ్ మోషన్ ఇవ్వడం వాళ్ల హక్కు అంటూ వ్యాఖ్యానించారు. కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా కొసరుతో కొట్లాడుతున్నారన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఆయన సభలో కూర్చొని ఉండగా.. మాట్లాడాలనే కోరిక తనకు ఉందన్నారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్‌లో ఆదాయం పెరుగుతోందన్నారు. కాంగ్రెస్ ఏడాది కాలంపై ఎలాంటి వ్యతిరేకత లేదని… వైఎస్ఆర్ సమయంలో కూడా ఇలానే ప్రచారం జరిగిందన్నారు. రెండు మూడు ఏళ్లలో అన్ని సర్దుకున్నాయని.. వర్షాలు బాగా పడ్డాయన్నారు. అదానీ విషయంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ పాలసీనే రాష్ట్రంలో అమలు జరుగుతుందన్నారు.
Read Also: KTR: శాసన సభ నడిచినన్ని రోజులు లగచర్ల ఘటనపై కొట్లాడుతాం..
భూమి లేని నిరుపేదలకు రూ.12000 ఇవ్వడం వల్ల సుమారు 15 లక్షల కుటుంబాలకు లబ్ది చేకూరనుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. 1000 కోట్లు విడుదల చేసే యోచనలో ప్రభుత్వం ఉందన్నారు. సంక్రాతికి రైతు భరోసా, ఆసరా పెన్షన్ల విడుదలకు యత్నిస్తున్నామన్నారు. గత రెండు మూడు సంవత్సరాల నుంచి పోల్చుకుంటే స్థాంప్స్ &రిజిస్ట్రేషన్ ఆదాయం పెరిగిందన్నారు. గత మూడు నెలల నుండి రియల్ ఎస్టేట్ పెరిగిందని మంత్రి వెల్లడించారు.