NTV Telugu Site icon

Peddireddy Ramachandra Reddy: హిందూపురంపై పెద్దిరెడ్డి ఫోకస్‌.. టీడీపీ గెలిచి ఏం చేసింది..?

Peddireddy

Peddireddy

Peddireddy Ramachandra Reddy: హిందూపురం నియోజకవర్గంలో పొలిటికల్‌ హీట్‌ పెరిగింది.. ఓవైపు సిట్టింగ్‌ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పర్యటిస్తూ.. వరుసగా కార్యకర్తలు, పార్టీ శ్రేణులతో సమావేశాలు నిర్వహిస్తుండగా.. మరోవైపు.. హిందూపురంపై ఫోకస్‌ పెట్టారు మంత్రి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. వరుసగా ఆరు రోజులపాటు నియోజవర్గంలో పర్యటించనున్నారు.. ఎన్ని సార్లు హిందూపూర్ ప్రజలు ఒకే పార్టీని గెలిపించినా హిందూపూర్ ఏమి అభివృద్ధి చెందింది.? అని ప్రశ్నిస్తున్నారు.. బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న వ్యక్తి సీఎం జగన్ మోహన్ రెడ్డి .. బీసీ మహిళలను హిందూపూర్ పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలకు సమన్వయకర్తలుగా నియమించారు. నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అని చెప్పి.. అవి చేతల్లో చూపించే గొప్ప నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. చంద్రబాబు ఎన్నికలకు ముందు ఒక మైనారిటీకి మంత్రి పదవి ఇచ్చి ఓట్లు ఆశించారు. 2014లో చంద్రబాబు రైతు, మహిళా రుణమాఫీలు అని చెప్పి మోసం చేశారు. ఎన్నికల ముందు చెప్పిన విధంగా పెన్షన్ మూడు వేలు చేసిన ఘనత వైఎస్ జగన్ దే అన్నారు మంత్రి పెద్దిరెడ్డి.

Read Also: Amitabh Bachchan: మా ఆత్మగౌరవాన్ని తగ్గించొద్దు.. లక్షద్వీప్‌కు సపోర్ట్ గా బిగ్ బీ..

ఎన్నికలు ముందు పసుపు కుంకుమ అని చెప్పి ప్రజలను మభ్యపెట్టడం చంద్రబాబు మనస్తత్వం అని మండిపడ్డారు పెద్దిరెడ్డి.. ఎన్ని ఇబ్బందులు వచ్చినా సంక్షేమ పథకాలకు సంబంధించిన డబ్బులు అకౌంట్ లో వేయడం ఏ రోజు ఆలస్యం కాలేదన్నారు. ప్రతి గ్రామంలో సచివాలయం, వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రజలకు సేవ చేస్తున్నాం.. నా 50 ఏళ్ల రాజకీయ జీవితంలో ఈ స్థాయిలో హామీలు అమలు చేసిన వారిని చూడలేదన్నారు. చంద్రబాబు, బాలకృష్ణ, లోకేష్.. కరోనా సమయంలో హైదరాబాద్ లో దాక్కున్నారని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన వాలంటీర్ వ్యవస్థ ప్రజలకు కరోనాలో అండగా నిలిచిందన్న ఆయన.. ఏకకాలం లో 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత వైఎస్ జగన్ కు దక్కితే.. బాబు వస్తే జాబు వస్తుంది అని చెప్పి మోసం చేయిన ఘనత చంద్రబాబుది అని దుయ్యబట్టారు. ఇచ్చిన హామీలు అమలు చేసే జగన్ ను ఆదరించాలా ? లేదా హామీలను మర్చిపోయే చంద్రబాబు చేతిలో మోసపోవాల అనేది ప్రజలు ఆలోచించాలని సూచించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.