Peddireddy Ramachandra Reddy: కుప్పం ఎమ్మెల్యే, టీడీపీ అధినేత చంద్రబాబు కురబ కులస్థుల ఆరాద్య దైవం కనక దాసు విగ్రహం ఏర్పాటుకు ప్రాధాన్యత కల్పించాలని ఎందుకు ఆలోచించలేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. కురబ కులస్థులను గుర్తించిన పార్టీ వైసీపీ పార్టీనే అని ఆయన తెలిపారు. చిత్తూరు జిల్లా కుప్పంలో కనకదాసు విగ్రహ ఆవిష్కరణకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విచ్చేశారు. ప్రభుత్వ ఆసుపత్రి సెంటర్‌లో కనక దాసు విగ్రహాన్ని ఆవిష్కరించారు. కుప్పం ఆర్టీసీ కూడలిలో కురబ కులస్థుల బహిరంగ సభలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. కురబ కులస్థులను ఉద్దేశించి మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడారు.
Read Also: Andhrapradesh: కరోనా అలర్ట్.. కొత్త వేరియంట్‌తో అధికారులు అప్రమత్తం
కుప్పం నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉండి కూడా కనీసం త్రాగు, సాగునీరు ఎందుకు అందించలేదని మంత్రి పెద్దిరెడ్డి చంద్రబాబును ప్రశ్నించారు. 2014 ఎన్నికల తర్వాత శంకుస్థాపన చేసిన కృష్ణా జలాలను హంద్రీనీవా కాలువ ద్వారా ఎందుకు కుప్పం ప్రజలకు గంగా ,కృష్ణ జలాలు ఎందుకు కుప్పం అందించలేదన్నారు. ఏడుసార్లు చంద్రబాబును గెలిపించిన కుప్పం నియోజకవర్గంలో ప్రజలను గురించి ఎప్పుడైనా పట్టించుకున్నారా అంటూ ప్రశ్నలు గుప్పించారు. కుప్పంలో కనీసం ఎమ్మెల్సీ భరత్ గ్రామాల్లో పర్యటించినట్లు కూడా చంద్రబాబు పర్యటన చేయలేదన్నారు.