Peddireddy Ramachandra Reddy: ఎన్ని రాజకీయ పార్టీలు ఒక్కటైనా ఒంటరిగానే పోటీ చేస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. 2014లో లానే మళ్ళీ 2024లో కలిసి పోటీ చేస్తారు ఏమో అంటూ విపక్షాలను ఉద్దేశించి చెప్పుకొచ్చారు. తాము ఒంటరిగానే పోటీ చేస్తామన్నారు. వైసీపీ సర్కారు ప్రజలకు మంచి చేసిందని.. సీఎం వైఎస్ జగన్ సుపరిపాలన అందిస్తున్నారన్నారు. చంద్రబాబు రాజకీయంగా శక్తి హీనుడు అయ్యాడు కాబట్టి అందిరి సహకారం అవసరమని ఎద్దేవా చేశారు. రాయలసీమకు ఎవరు ఎంత మేలు చేసారో ప్రజలకు తెలుసని ఈ సందర్భంగా పేర్కన్నారు.
Also Read: Somu Veerraju: బీజేపీ అండగా ఉండకపోవచ్చన్న జగన్ వ్యాఖ్యలపై సోము వీర్రాజు ఫైర్
ఇదిలా ఉండగా.. పాడి రైతులకు ఐదు రూపాయలు పెంచుతాను అని పాదయాత్ర సమయంలో వైఎస్ జగన్ తెలిపారని.. అమూల్ ద్వారా 10 రూపాయలు అదనంగా పాడి రైతులకు ఇస్తున్నారని మంత్రి చెప్పారు. ప్రైవేట్ డెయిరీలు ప్రజలను దోచుకునే పరిస్థితి లేదన్నారు. ఎన్నికల హామీల్లో 99.5 శాతం హామీలు అమలు చేశారని.. జగన్ పాలనలో ఉద్యోగులు అందరూ సంతోషంగా ఉన్నారు, రైతులు, మహిళలు కూడా సంతోషంగా ఉన్నారన్నారు. 2014లో మహిళల అప్పులు తీరుస్తా అని చంద్రబాబు హామీ ఇచ్చి మోసం చేశారని విమర్శించారు. ఆ అప్పులు అన్ని అధికారంలోకి వచ్చాక తీరుస్తున్నామన్నారు. ఇప్పటికీ 19 వేల కోట్ల పైన మహిళలకి చెల్లించారన్నారు. సుమారు 35 శాతం పాల ఉత్పత్తి కూడా పెరిగిన పరిస్థితి ఉందన్నారు. పిల్లల చదువులు దృష్టిలో పెట్టుకొని నాడు-నేడు ద్వారా పాఠశాలలను అభివృద్ధి చేశామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు.
