Minister Payyavula Keshav: మాది మాటల ప్రభుత్వం కాదు… చేతల ప్రభుత్వం..

  • మాది మాటల ప్రభుత్వం కాదు... చేతల ప్రభుత్వం..
  • ప్రజల మనసుల్లో నిలిచేలా తమ ప్రభుత్వం పని చేస్తుందన్న మంత్రి పయ్యావుల..
Payyavulu Keshav

Payyavulu Keshav

Minister Payyavula Keshav: మాది మాటల ప్రభుత్వం కాదు… చేతల ప్రభుత్వం అన్నారు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్.. రాష్ట్రవ్యాప్తంగా ఈ రోజు ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం విస్తృతంగా సాగుతోంది.. అనంతపురంలో జిల్లాలో పెన్షన్ల పంపిణీలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మాది మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వం అన్నారు.. ప్రజల మనసుల్లో నిలిచేలా తమ ప్రభుత్వం పని చేస్తుందని ప్రకటించారు.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పెన్షన్‌ను రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెంచాం.. ఎన్నికల సమయం నుంచే అమలు చేస్తామన్న మాట ప్రకారం.. ఆ మూడు నెలల బకాయి.. ఈ నెల పెన్షన్‌ కలుపుకొని మొత్తం ఒకేసారి రూ.7 వేలు పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు.. ఇక, పండగ వాతావరణంలో ఎన్టీఆర్ భరోసా కింద పెన్షన్ల పంపిణీని జరుగుతుంది.. ఈ కార్యక్రమాన్ని ఉదయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారని గుర్తుచేశారు. కాగా, ఈ రోజు మంత్రి నారా లోకేష్‌ ప్రతినిథ్యం వహిస్తోన్న మంగళగిరిలో పర్యటించిన సీఎం చంద్రబాబు.. లబ్ధిదారుని ఇంటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేసి.. ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం విదితమే.

Read Also: Komatireddy Venkat Reddy: వారం రోజుల్లో రుణమాఫీ ప్రక్రియ ప్రారంభం