బాధ్యతారహితమైన ప్రతిపక్షం ఉండటం ప్రజలు చేసుకున్న దురదృష్టమని మంత్రి పార్థసారథి అన్నారు. విశాఖలో ఆయన మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు సహా అన్నింటిపైన జగన్ విషం చిమ్ముతున్నారని విమర్శించారు. పోలవరంపై అబద్ధాలను ప్రచారం చేసి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం జరుగుతోందని వెల్లడించారు. డయా ఫ్రా వాల్‌ను ధ్వంసం చేసి పోలవరం ప్రాజెక్టు చుట్టూ గందరగోళం సృష్టించడం కోసం ప్రణాళిక బద్ధంగా ప్రయత్నం జరుగుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. బాధ్యత కలిగిన నాయకుడు విద్వేషాలు రెచ్చ గొట్టి లబ్ధి పొందాలనేది దుర్మార్గపు ఆలోచనలు చేస్తున్నారని ఆరోపించారు. సినిమాలతో పోల్చి ప్రజా జీవితాలను గురించి మాట్లాడటం దిగజారుడు తనానికి నిదర్శనమని మండిపడ్డారు..
READ MORE: Instagram Auto Scroll: ఇక రీల్స్ స్వైప్ చేయాల్సిన అక్కర్లే.. ఆటోమేటిక్‌గా నెక్స్ట్ రీల్ చూసేయ్యండి!
“రప్పా రప్పా అని సినిమాలో ఉంటే దానిని అమలు చేస్తామని చెప్పడం మీ సంస్కృతికి నిదర్శనం.. అధికారులు, పోలీసులు పనిచేయకుండా డీ మొరలైజ్ చేయడం ద్వారా లబ్ధి పొందే ప్రయత్నం జరుగుతోంది. ఒక మీడియా సంస్థ నడుపుతున్న కుటుంబం నుంచి వచ్చిన జగన్.. మీడియాను టిష్యూ పేపర్ తో పోల్చడం చూస్తే వ్యవస్థలపై ఆయనకు ఉన్న గౌరవం ఏ పాటీదో అర్థం చేసుకోవచ్చు.. రాష్ట్ర ప్రయోజనాలను ఫణంగా పెట్టీ జగన్ రాజకీయ ప్రయోజనాలు పొందే ప్రయత్నం చేస్తున్నారు.. జగన్ చెబుతున్నట్టు ప్రజల్లో వ్యతిరేకత నిజమైతే మేం తొలి అడుగు కార్యక్రమంలో 70శాతం ఇళ్లను ఎలా కవర్ చేయగలిగాం.. రాష్ట్రంలో పెట్టుబడులు రాకూడదనేది వైసీపీ ఆలోచన. జగన్ తాటాకు చప్పుళ్లకు భయపడేవాళ్ళు ఎవరు లేరు..” అని మంత్రి పార్థసారథి వ్యాఖ్యానించారు.
READ MORE: Dowry Harassment: ఎంత బాధ అనుభవించావు మనీషా.. కాళ్లు, కడుపుపై సూసైడ్ నోట్..
