బాధ్యతారహితమైన ప్రతిపక్షం ఉండటం ప్రజలు చేసుకున్న దురదృష్టమని మంత్రి పార్థసారథి అన్నారు. విశాఖలో ఆయన మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు సహా అన్నింటిపైన జగన్ విషం చిమ్ముతున్నారని విమర్శించారు. పోలవరంపై అబద్ధాలను ప్రచారం చేసి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం జరుగుతోందని వెల్లడించారు.