Minister Rama Naidu: రాయలసీమకు సాగు, తాగు నీరందించేందుకు ఎన్డీయే కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు శాసనమండలిలో పేర్కొన్నారు. కర్నూలు జిల్లా నందికొట్కూరు తాలూకాలో సిద్దేశ్వరం – అలుగు ప్రాజెక్ట్‌పై శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి నిమ్మల రామానాయుడు సమాధానం ఇచ్చారు. సిద్దేశ్వరం- అలుగు రిజర్వాయర్ ద్వారా అదనపు నీటి నిల్వ సామర్థ్యం ఉంటే తప్పనిసరిగా పరిశీలన చేసి చేపడతామన్నారు.
Read Also: RK Roja: తప్పచేస్తే కేసులు పెట్టండి.. దొంగ కేసులు పెడితే ఊరుకోం..
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 5 నెలల్లోనే హంద్రీనీవాకు రూ. 2500 కోట్లు కేటాయించి రాయలసీమకు తాగు , సాగు నీరందించే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి వెల్లడించారు. వైసీపీ ఐదేళ్లలో హంద్రీనీవాకు 5 రూపాయలు కూడా ఖర్చుపెట్టలేదని విమర్శించారు. 2019-24 పాలనాకాలంలో 12 లక్షల కోట్ల బడ్జెట్ పెడితే , రాయలసీమ ప్రాజెక్టులకు 2 వేల కోట్లు కూడా కేటాయించలేదని మంత్రి మండిపడ్డారు.