NTV Telugu Site icon

Minister Narayana : రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి అధికంగా ప్రాధాన్యమిస్తోంది

Narayana

Narayana

Minister Narayana : నెల్లూరు నగరంలోని బి.వి.ఎస్. నగరపాలక సంస్థ బాలికల ఉన్నత పాఠశాలలో జరిగిన తల్లిదండ్రులు.. ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో మంత్రి నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజున తల్లిదండ్రులు.. ఉపాధ్యాయుల సమావేశాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి అధికంగా ప్రాధాన్యమిస్తోందని, రాష్ట్రంలో కొత్తగా ఐదు ప్రాంతాల్లో మోడల్ స్కూల్స్ ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు మంత్రి నారాయణ. కార్పొరేట్ స్కూల్స్ విజయానికి కారణం తల్లిదండ్రులు.. ఉపాధ్యాయుల సమావేశాలే కారణమని, ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ ఉపాధ్యాయులు ఉన్నారన్నారు మంత్రి నారాయణ. ప్రైవేట్ పాఠశాలల్లో ఉపాధ్యాయులకు ఓరియంటేషన్ ఇవ్వడం వల్లే వాళ్ళు బాగా బోధిస్తున్నారని, ప్రభుత్వ ఉపాధ్యాయులకు కూడా ఎప్పటికప్పుడు ఓరియంటేషన్ కార్యక్రమాలను నిర్వహించాలన్నారు.

Pushpa 2: “సర్.. నేను పుష్ప 2 సినిమాకు వెళ్తున్నా..” మేనేజర్‌కి ఉద్యోగి మెసేజ్

అంతేకాకుండా..’ రాష్ట్రంలో విద్యారంగ అభివృద్ధికి నా వంతు సలహాలను ఇస్తున్నాను. తల్లిదండ్రులు.. ఉపాధ్యాయుల సమావేశాలు తరచూ జరగాలి. వీటివల్ల ఎన్నో మంచి ఫలితాలు వస్తాయి. విద్యారంగంలో నాకు 44 సంవత్సరాల అనుభవం ఉంది. నేను వీధి బడిలోనే చదువుకున్నా. నేను పదో తరగతి ఫెయిల్ అయ్యాను. అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న భవనం వెంకట్రామ్ రెండు గ్రేస్ మార్కులు ఇచ్చారు. దీంతో నేను పాస్ అయ్యాను. తరువాత కసిగా చదివాను. అప్పటినుంచి డిగ్రీ..పి. జీ.లో యూనివర్సిటీ ఫస్ట్ వచ్చాను. విద్యా సంస్థను ప్రారంభించి అగ్రస్థానానికి తీసుకువచ్చాను. పిల్లలకు మార్కులు తగ్గితే తల్లిదండ్రులు వారిని..తిట్టవద్దు. సంబంధిత సబ్జెక్ట్ ఉపాధ్యాయుడితో మాట్లాడితే సమస్య పరిష్కారం అవుతుంది. అందరూ బాగా చదువుకొని జీవితంలో ఎదగాలి’ అని మంత్రి నారాయణ వ్యాఖ్యానించారు.

Mamata Banerjee: తృణమూల్‌ కాంగ్రెస్‌ తదుపరి వారసులు ఎవరు? మమతా బెనర్జీ ఏమన్నారంటే..

Show comments