Minister Narayana : నెల్లూరు నగరంలోని బి.వి.ఎస్. నగరపాలక సంస్థ బాలికల ఉన్నత పాఠశాలలో జరిగిన తల్లిదండ్రులు.. ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో మంత్రి నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజున తల్లిదండ్రులు.. ఉపాధ్యాయుల సమావేశాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి అధికంగా ప్రాధాన్యమిస్తోందని, రాష్ట్రంలో కొత్తగా ఐదు ప్రాంతాల్లో మోడల్ స్కూల్స్ ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు మంత్రి నారాయణ. కార్పొరేట్ స్కూల్స్ విజయానికి కారణం తల్లిదండ్రులు..…