ఈరోజు వరకు రూ.1050 కోట్ల రూపాయల ధాన్యం కొనుగోలు చేశామని.. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే రెండింతలు కొనుగోలు చేశామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు మండలంలో పౌరసరఫరాల శాఖ మంత్రి ఆకస్మికంగా పర్యటించారు. తుఫాను రాబోతుంది అన్న వార్తలతో రైతులు ఆందోళన చెందుతున్నారు అన్న సమాచారం మేరకు ధాన్యం సరఫరా మిల్లులకు ఏ విధంగా సాగుతుంది? ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? మిల్లుల వద్ద అని దగ్గరుండి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాతావరణంలో మార్పుల వల్ల పది రోజుల్లో జరగాల్సిన కోతలు ముందుగానే సాగుతున్నాయన్నారు.
READ MORE: Bangladesh: హిందూ నేత చిన్మోయ్ కృష్ణదాస్ తరుపున వాదిస్తున్న ముస్లిం లాయర్ హత్య..
రైతులకు గోతాములు ఇబ్బంది లేకుండా మిల్లులకు ధాన్యం సరఫరా అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి నాదెండ్ల మనోహర్ హామీ ఇచ్చారు. తేమ శాతం వల్ల ఇబ్బందులు పడుతున్నామని రైతుల తమ దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిపారు. దీనిపై మిల్లర్లు సానుకూలంగా స్పందించారని ఆయన సూచించారు. ధాన్యం రవాణా విషయంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వాతావరణ మార్పులు దృష్టిలో ఉంచుకుని జీపీఎస్ లేకపోయినా ధాన్యం మొత్తం మిల్లర్లకు తరలించడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ధాన్యం కొనుగోలులో రైతులెవరు అధైర్యపడవద్దు. మిల్లర్లతో అన్ని విషయాలు చర్చించామని స్పష్టం చేశారు.
READ MORE: Mega DSC: గుడ్‌న్యూస్.. మెగా డిఎస్సీ సిలబస్‌పై ప్రభుత్వ ప్రకటన.. నోటిఫికేషన్ ఎప్పుడంటే?