Merugu Nagarjuna: గతంలో వైసీపీ కోసం పనిచేసిన సమయంలో వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు.. బీహార్ వాడొచ్చాడు వాడి వల్ల ఏమవుతుందన్న చంద్రబాబు.. ఇప్పుడు ఎందుకు పీకేతో కలుస్తున్నారని మంత్రి మేరుగ నాగార్జున ప్రశ్నించారు. పది మంది ప్రశాంత్ కిషోర్‌లు వచ్చినా ప్రజలంతా సీఎం జగన్ వెంట ఉన్నారన్నారు. అవకాశం ఉంటే కాళ్లతో తన్నటం, లేకుంటే తెచ్చి పెట్టుకోవటం చంద్రబాబు నైజమని మంత్రి విమర్శించారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ రథచక్రాలు ఊడిపోబోతున్నాయి.. ఆ పార్టీ ఓడిపోతుందని ఆయన అన్నారు.
Read Also: Chandrababu: వచ్చే ఎన్నికలు వైసీపీ – టీడీపీ, జనసేన మధ్య జరిగే ఎన్నికలు కావు..
చంద్రగిరిలో పుట్టిన చంద్రబాబు కుప్పంలో పోటీ చేస్తారు.. లోకేష్ మంగళగిరిలో పోటీ చేస్తారు.. బీసీల సీట్లపై పోటీ చేసే చరిత్ర టీడీపీది అన్న మంత్రి.. సీఎం జగన్ బొమ్మ మీద మేము గెలుస్తామని తెలిపారు. సినీ నటుడు పృథ్వీరాజ్ మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. రాజకీయాల గురించి ఆయనకేమి తెలుసు.. హూ ఈజ్ పృథ్వీరాజ్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ రాజు మాట్లాడినా మేము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. 175కు 175 సీట్లు గెలవబోతున్నామని మంత్రి పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం కోసం అవసరమైన సమయాల్లో ప్రభుత్వాలు అప్పులు తెచ్చుకుంటాయన్నారు.
Read Also: Andhrapradesh: కరోనా అలర్ట్.. కొత్త వేరియంట్‌తో అధికారులు అప్రమత్తం
పవన్ కళ్యాణ్ తెలంగాణలో బర్రెలక్కకు వచ్చినన్ని ఓట్లు కూడా రాలేదని మంత్రి ఎద్దేవా చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. నాలుగు రోజులు నడిచాడు.. ఆపాడు.. వాళ్ళ నాయన జైలుకు పోతే మళ్ళీ ఆపాడు.. దాన్ని పాదయాత్ర అంటాడని లోకేష్‌ను ఉద్దేశించి మంత్రి వ్యాఖ్యానించారు. ఎర్ర పుస్తకాన్ని మడిచి మీ నాన్నకు ఇవ్వు.. అంటూ తీవ్రంగా మండిపడ్డారు. ప్రజల కోసం నిరంతరం ఆలోచించే నాయకుడే సీఎం జగన్ అంటూ ఆయన పేర్కొన్నారు. మేనిఫెస్టోను అమలు చేసిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందన్నారు. మా నేత ఇచ్చిన హామీలను వంద శాతం అమలు చేస్తారని మంత్రి స్పష్టం చేశారు.