Minister Merugu Nagarjuna: సంక్షేమ పథకాలపై చంద్రబాబుతో చర్చకు సిద్ధం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Merugu Nagarjuna: బడుగు, బలహీన వర్గాల స్థితిగతులు పెంచేందుకు జగన్ ఎంతో కృషి చేస్తున్నారని మంత్రి మేరుగ నాగార్జున పేర్కొన్నారు. రాష్ట్రంలోనే పేదల విద్యార్థులు బాగుండాలనే ఉద్దేశంతో ఇంగ్లీష్ మీడియంలో తీసుకువచ్చారని.. చంద్రబాబు మనవడు ఇంగ్లీష్ మీడియంలో చదవచ్చు.. వాళ్ళ బంధువులు చదవచ్చు.. కానీ బడుగు వర్గాల పిల్లలు మాత్రం చదువుకోకూడదని న్యాయస్థానాలకు వెళ్ళాడని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. అనారోగ్య కారణాలతో ఎందరో బడుగులు మరణించారని.. దానిని చూసే వైయస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకువచ్చారన్నారు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ కింద చికిత్స చేయించుకునే మొత్తాన్ని రూ.25 లక్షలకు జగన్ పెంచారని తెలిపారు. పార్టీలతో సంబంధం లేకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలను ఇస్తున్నారని వెల్లడించారు.
Read Also: Deputy CM Peedika Rajanna Dora: అన్ని వర్గాల అవసరాలను తీర్చే పాలనను జగన్ ఇస్తున్నారు..
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
పేదల కోసం జగన్ ఎన్నో పథకాలను అమలు చేస్తుంటే… టీడీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారని మంత్రి అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు రాజకీయాల్లో కూడా బడుగులకు ఎంతో ప్రాధాన్యమిచ్చారని ఈ సందర్భంగా చెప్పారు. చంద్రబాబు హయాంలో దళితులపై దాడులు.. అఘాయిత్యాలు… అమానుషాలు జరిగాయన్నారు. అప్పట్లో భయంతో బతికేవారని మంత్రి చెప్పుకొచ్చారు. బీసీలు జడ్జిలుగా పనికిరాని చంద్రబాబు అన్నారని ఆయన గుర్తు చేశారు. చంద్రబాబుకు వయసై పోయింది.. ఆయన మానసిక స్థితి కూడా బాగాలేదన్నారు. లోకేష్ పాదయాత్ర చేసి రెడ్ బుక్ చూపిస్తున్నాడన్న మంత్రి.. లోకేష్ పాదయాత్ర ప్రారంభించగానే కుటుంబ సభ్యులలో ఒకరు మరణించారని విమర్శించారు. అవినీతిలో చంద్రబాబు జైలుకెళితే… లోకేష్ ఎక్కడికో పారిపోయారన్నారు. చంద్రబాబు అరెస్ట్ వల్ల చనిపోయారని కొందరికి భువనేశ్వరి చెక్కులు ఇచ్చింది.. బెయిల్ వస్తే అన్నీ ఆపేసిందన్నారు. క్రైస్తవ మిషన్లకు చెందిన ఆస్తులను చంద్రబాబు అనుచరులు కాజేశారని ఆయన ఆరోపించారు. సంక్షేమ పథకాలపై చంద్రబాబుతో చర్చకు సిద్ధంగా ఉన్నామని ఆయన సవాల్ విసిరారు. అన్ని తరాల భవిష్యత్తు కోసం జగన్ పనిచేస్తున్నారని.. ఆయనను అందరూ ఆశీర్వదించాలని మంత్రి మేరుగ నాగార్జున స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!