NTV Telugu Site icon

Merugu Nagarjuna: దళిత సంక్షేమాన్ని అపహాస్యం చేసింది చంద్రబాబే..

Minister Merugu Nagarjuna

Minister Merugu Nagarjuna

Merugu Nagarjuna: ఉద్యమాలతో సంబంధం లేకుండా అసైన్డ్ భూములు పేదలకు సీఎం జగన్ ఇచ్చారని మంత్రి మెరుగు నాగార్జున పేర్కొన్నారు. లంక భూములు, చుక్కల భూములు ఇలా అనేక రకాలుగా సమస్యలు ఉన్నాయన్నారు. ఇవాళ ఎస్సీలకు సంబంధించి ఎప్పుడో ఇచ్చిన పట్టాలు ఇప్పుడు మళ్ళీ దళితులకు చెందేలా సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారని మంత్రి తెలిపారు.

Also Read: AP Caste Census: రాజమండ్రిలో సమగ్ర కులగణన రౌండ్‌ టేబుల్‌ సమావేశం

దళిత యువకుడు చనిపోతే వెంటనే సీఎం స్పందించి కుటుంబానికి అండగా ఉండమని సీఎం జగన్ చెప్పారన్నారు. బూతులు మాట్లాడ్డం మాక్కూడా వచ్చన్నారు. సీఎం జగన్ దళిత యువకుడి మృతిపై వెంటనే స్పందిస్తే.. రాజకీయాల్లో వెనకబడ్డ వారు జగన్ పట్టించుకోలేదని విమర్శలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో దళిత సంక్షేమాన్ని అపహాస్యం చేసింది చంద్రబాబేనని మంత్రి మెరుగు నాగార్జున స్పష్టం చేశారు. చంద్రబాబుకు చెంచా గిరి చేసే వాళ్ళు మా మంత్రులను ఎమ్మెల్యేలను విమర్శలు చేస్తే ఊరుకోమన్నారు.