Site icon NTV Telugu

KTR On Modi: ప్రధాని మోడీ ప్రసంగంపై మంత్రి కేటీఆర్ రియాక్షన్..

Ktr

Ktr

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రసంగంపై బీఆర్ఏస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్పందించారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ తెలంగాణ ప్రజల 45 ఏళ్ల కల అని ఆయన డిమాండ్ చేశారు. గుజరాత్ కి 20 వేల కోట్ల రూపాయల లోకోమోటివ్ ఫ్యాక్టరీ తన్నుకుపోయిన ప్రధాని, 520 కోట్ల రైల్వే వ్యాగన్ రిపేర్ షాప్ పెట్టడం తెలంగాణ ప్రజలను అవమానించడమే అని కేటీఆర్ అన్నారు. తొమ్మిదేళ్లలో దేశ యువత కోసం చేసిన ఒక్క మంచి పనైనా ప్రధాని చెప్తే బాగుండేదన్నారు.

Read Also: Karnataka: కర్ణాటకలో జైన మత గురువు హత్య.. ఇద్దరు అరెస్ట్

దేశ చరిత్రలోనే అత్యధిక నిరుద్యోగం సృష్టించిన విఫల ప్రధాని మోడీ అని మంత్రి కేటీఆర్ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వంలో 16 లక్షల ఖాళీలు భర్తీచేయకుండా, రాష్ట్రంలో రెండు లక్షల ఇరవై వేల ప్రభుత్వ ఉద్యోగాలు నింపిన మాపై నిందలు వేస్తారా అని నిలిదీశారు. ఉద్యోగం అడిగితే పకోడీలు వేసుకోమన్న ప్రధాని యువత గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నాడు.

Read Also: Falaknuma Express: తలుచుకుంటేనే గుండె దడ.. ట్రైన్ ఎక్కాలంటేనే భయం

రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లును ఆమోదించకుండా యూనివర్సిటీ ఖాళీల భర్తీని అడ్డుకుంటున్న గవర్నర్ కి ప్రధాని ఒక మాట చెబితే బాగుండేది అని మంత్రి కేటీఆర్ అన్నారు. గిరిజన విశ్వవిద్యాలయాన్ని అడ్డుకొని, అడవి బిడ్డల గురించి మాట్లాడటం ప్రధాని కపట ప్రేమకు నిదర్శనం అని కేటీఆర్ చెప్పారు. 15 వేల మంది స్ధానికులకు ఉద్యోగాలిచ్చే  బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ గురించి ఒక్క మాట కూడా ప్రధాని మోడీ మాట్లాడలేదు.. నల్ల చట్టాలతో 700 మంది రైతులను పొట్టనబెట్టుకున్న ప్రధాని వ్యవసాయం గురించి మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్లేనని అన్నారు.

Read Also: Donkey Attack on Man: వ్యక్తిపై గాడిద దాడి.. కాలుపట్టుకుని రోడ్డుపై ఈడ్చుకుంటూ..

సమగ్ర వ్యవసాయ అభివృద్ధి, రైతు సంక్షేమంలో దేశానికి ఆదర్శం, దిక్సూచిగా తెలంగాణ  నిలుస్తుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణ మా కుటుంబం.. రాష్ట్ర ప్రజలు మా కుటుంబ సభ్యులు.. వారి సర్వతోముఖాభివృద్ధికి పాటుపడుతున్న తెలంగాణ కుటుంబ పార్టీ మాది అని ఆయన అన్నారు. కేంద్ర ఏజెన్సీల బూచి చూపించి ప్రధాని చేసిన హెచ్చరికలకు, ఉడత ఊపులకు మేం భయపడమని కేటీఆర్ చెప్పారు. తెలంగాణకు వచ్చి ఇక్కడి ప్రభుత్వంపైన అవాకులు చవాకులు పేలడం, అసత్యాలు మాట్లాడడం ఉపన్యాసం ఇచ్చి ఉత్త చేతులతో పోవడం మోడీకి అలవాటుగా మారిందని కేటీఆర్ అన్నారు.

Exit mobile version