Donkey Attack on Man: వ్యక్తిపై గాడిద దాడి.. కాలుపట్టుకుని రోడ్డుపై ఈడ్చుకుంటూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రలోని కొల్హాపూర్ లో ప్రజలను ఓ వీడియా చక్కర్లు కొడుతూ భయపెడుతుంది. ఇంతకీ.. ఏం జరిగిందంటే.. ఒక గాడిద ఉన్నట్టుండి ఒక వృద్ధునిపై అకస్మాత్తుగా దాడి చేసింది. అయితే.. సాధారణంగా గాడిదలు శాంత స్వభావంతోనే కనిపిస్తాయి. కానీ.. కొల్హాపూర్‌కు చెందిన ఈ వీడియోలోని గాడిద అంటే అందరికీ భయం కలిగేలా చేసింది. పైగా ఆ గాడిదను ఎంతమంది అడ్డుకున్నా.. అది సదరు వృద్ధునిపై దాడిని మాత్రం ఆపలేదు. ప్రస్తుతం ఈ ఘటన అక్కడున్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యింది.
Read Also: Bhatti Vikramarka: మోడీ పర్యటన వల్ల తెలంగాణ కు ఉపయోగం లేదు
Also Read
ఈ ఘటన నిన్న ( శుక్రవారం) ఉదయం 11 గంటలకు చోటు చేసుకుంది. ఈ వీడియోలో.. ఒక వృద్ధుడు రోడ్డుపై నడుచుకుంటు వెళ్తు్ండటం కనిపిస్తుంది. ఆ టైంలో రోడ్డు పక్కన నిలబడిన ఒక గాడిద ఉన్నట్టుండి, ఆ వృద్ధుడి వైపు పరిగెత్తకుంటూ వచ్చి.. అతనిపై దాడికి దిగింది. ఆ వృద్ధుడిని కింద పడవేసి తన నోటితో కొరుకుతూ.. కాళ్లతో తొక్కివేయడం వీడియోలో మనం చూడొచ్చు. వృద్ధుడిపై గాడిద దాడి చేయడం గమనించిన చుట్టుపక్కల వారు అతడ్ని గాడిద బారి నుంచి రక్షించేందుకు ప్రయత్నించారు. అయినా ఆ గాడిద తన పట్టువీడక ఆ వృద్ధునిపై దాడి చేస్తూనే ఉంది. తరువాత ఒక వ్యక్తి దానిపైకి రాయి విసిరినా అది ఏమాత్రం భయపడకూండా వృద్ధుడిని గాయపరుస్తుంది.
దీంతో మరికొందరు కర్రతో దాన్ని కొట్టడంతో ఆది.. వారి నుంచి తప్పించుకుని పక్కకు వెళ్లిపోతుంది. ఆ తరువాత ఆ వృద్దుడు కాస్త తేరుకుని నిలబడతాడు. అయితే.. గడచిన మూడు రోజుల్లో జంతువుల కారణంగా దాడి జరగటం ఇది రెండవసారి. ఈ ఘటన కొల్హాపూర్‌లోని గాంధీనగర్‌లో జరిగింది. ఈ వీడియో చూసిన స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి ముందు ఇదే ప్రాంతంలో జరిగిన కుక్కల దాడిలో 13 మంది గాయాల పాలయ్యారు. ఈ దాడులపై అధికారులకు ఫిర్యాదు చేసినా వాళ్లు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
తాజావార్తలు
-
Yogi Adityanath: హమీద్ అన్సారీ ‘హిందూ’ వ్యాఖ్యలపై యోగి ఘాటు కౌంటర్
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
-
Komatireddy Venkat Reddy : కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలి.. మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్..
-
Asaduddin Owaisi: ‘బీజేపీని ఆపాలంటే మాతో మాట్లాడండి’.. యూపీలో ఓవైసీ ఆఫర్..
-
Team India: టీమిండియాకు బిగ్ షాక్.. శుభమన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా దూరం.. కారణం ఇదే..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!