విలక్షణ నటుడిగా ప్రకాశ్ రాజ్‌కు ప్రత్యేక పేరుంది. అయితే.. ఆయన సినిమాల్లోనే కాకుండా.. రాజకీయాల్లో సైతం తన బాణీ కనబరుస్తుంటారు. అయితే.. హైదరాబాద్ షాద్ నగర్ నియోజకవర్గం పరిధిలోని కేశంపేట మండలంలో గల కొండారెడ్డిపల్లి గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. అయితే.. ఆ గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు పూనుకున్న ప్రకాశ్‌రాజ్.. సిమెంట్ రోడ్డుకు ఇరువైపులా ఫుట్ పాత్ ను, దిమ్మెలను ఏర్పాటు చేయించారు. అంతేకాకుండా.. గ్రామంలో చెట్లను పెంచి పచ్చని వాతావరణాన్ని నెలకొల్పారు. అలాగే గ్రామస్థుల ఆరోగ్య సమస్యలకు ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేయించారు.
ఈ నేపథ్యంలో ప్రకాశ్ రాజ్ పై మంత్రి కేటీఆర్ ప్రశంసలు జల్లు కురిపించారు. ప్రకాశ్ రాజ్ దత్తత తీసుకున్న గ్రామం ఎంతో అభివృద్ధి చెందిందని కొనియాడిన మంత్రి కేటీఆర్.. స్థానిక ఎమ్మెల్యే అంజయ్యతో కలిసి గొప్ప పురోగతిని సాధించారని ప్రశంసించారు.