Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Minister Ktr Once Again Fires On Singareni Action

Minister KTR : మరోసారి సింగరేణి బొగ్గు బ్లాకుల వేలంపై మండిపడ్డ మంత్రి కేటీఆర్

Published Date :April 6, 2023 , 5:20 pm
By Gogikar Sai Krishna
Minister KTR : మరోసారి సింగరేణి బొగ్గు బ్లాకుల వేలంపై మండిపడ్డ మంత్రి కేటీఆర్
  • Follow Us :
  • google news
  • dailyhunt

కేంద్ర ప్రభుత్వం సింగరేణిని పూర్తిగా ప్రైవేటీకరించి చేతులు దులుపుకోవాలన్న కుట్రలకు పాల్పడుతోందని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు మండిపడ్డారు. తాజాగా సింగరేణిలోని మరోసారి బొగ్గు గనుల వేలానికి కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ స్థాయిలో మహా ధర్నా కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. ఈ నెల 8వ తేదీన మంచిర్యాల, భూపాలపల్లి, పెద్దపల్లి, రామగుండం కేంద్రాల్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సింగరేణి కార్మికులతో కలిసి పెద్దఎత్తున ఈ ధర్నా కార్యక్రమాలను నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ మేరకు సింగరేణి ప్రాంతంలోని జిల్లాల పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలతో మంత్రి కే తారకరామారావు ప్రత్యేకంగా మాట్లాడారు. ఒకవైపు తెలంగాణ ప్రభుత్వం సింగరేణి ప్రైవేటీకరణ ప్రయత్నాలను ఆపాలని కేంద్రానికి అనేకమార్లు విజ్ఞప్తి చేస్తున్న కేంద్రం మాత్రం కుట్రపూరితంగా గనుల వేలం ప్రక్రియను మరోసారి తెరపైకి తీసుకువచ్చిందని కేటీఆర్ అన్నారు. ఇప్పటికే పలుమార్లు గనుల వేలం ప్రక్రియ ప్రయత్నం చేసిన ప్రైవేటు కంపెనీల నుంచి ఎలాంటి స్పందన రాలేదని, మరోవైపు ఇవే గనులని నేరుగా సింగరేణికి కేటాయించాలని అనేక సంవత్సరాలుగా కోరుతున్నామని కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అటు సింగరేణి కార్మికులు తెలంగాణ ప్రజలు ఏకకంఠంతో సింగరేణి కోసం ప్రత్యేకంగా గనులు కేటాయించాలని కోరినా, పట్టించుకోకుండా మరోసారి సత్తుపల్లి బ్లాక్ 3, శ్రావణ పల్లి, పెన గడప గనుల వేలం కోసం మరోసారి నోటిఫికేషన్ కేంద్రం ఇచ్చిందన్నారు. మార్చి 29 నుంచి మే 30 వరకు ఈ గనులకు వేలం ప్రక్రియను నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, వేలం ప్రక్రియతో సంబంధం లేకుండా సింగరేణికి నేరుగా బొగ్గు గనులను కేటాయించాలని కేటీఆర్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

Also Read : Woman Dances: ఢిల్లీ మెట్రో ప్లాట్‌ఫారమ్‌పై యువతి డ్యాన్స్.. నెటిజన్లు రియాక్షన్ ఇది..

సింగరేణి ఒక కంపెనీ మాత్రమే కాదని.. తెలంగాణ రాష్ట్రానికి కొంగుబంగారమని అన్నారు మంత్రి కేటీఆర్. తెలంగాణను దెబ్బ కొట్టాలన్న దురుద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం పదేపదే సింగరేణి ప్రైవేటీకరణ కుట్రలు కొనసాగిస్తోందని దుయ్యబట్టారు. ఇప్పటికే సింగరేణి ప్రైవేటీకరణ ప్రయత్నాలను భారత రాష్ట్ర సమితి తరపున, అలాగే తెలంగాణ ప్రభుత్వం పక్షాన తీవ్రంగా వ్యతిరేకించామని కేటీఆర్ గుర్తు చేశారు. ఈ మేరకు సింగరేణికి అవసరమైన బొగ్గు గనులను నేరుగా కేటాయించాలని గౌరవ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు గతంలో కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారని గుర్తు చేశారు. అయితే ఇప్పటికే లాభాల్లో నడుస్తున్న అనేక ప్రభుత్వ రంగ సంస్థలను అప్పనంగా అమ్మేస్తున్న కేంద్ర ప్రభుత్వం సింగరేణిని కూడా తెగ నమ్మాలని కంకణం కట్టుకుందని కేటీఆర్ ఆరోపించారు. లాభాల బాటలో వున్న సింగరేణికి.. భవిష్యత్తులో బొగ్గు గనులు కేటాయించకుండా నష్టాల బాట పట్టించాలన్న కుతంత్రంలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం పావులు కదుపుతుందని దుయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్ లోని వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు కూడా గనులు కేటాయించకుండా ఆ సంస్థను దివాలా తీయించిన కేంద్రం..అదే విష ప్రయోగాన్ని ఇక్కడ అమలు చేయాలని చూస్తుందన్నారు..! పోరాటాల పురుటిగడ్డ అయిన తెలంగాణలో.. ఎట్టపరిస్థితుల్లోనూ కేంద్ర ప్రభుత్వ కుట్రలను అడ్డుకుని తీరుతామని కేటీఆర్ అన్నారు.

Also Read: Kichcha Sudeep: సుదీప్ ప్రైవేట్ వీడియోలు.. తీసింది అతనే ..?

సింగరేణి ప్రైవేటీకరణ విషయంలో దాగుడుమూతలు ఆడుతున్న కేంద్ర ప్రభుత్వం పైకోమాట.. అంతర్గతంగా లోపలో కుట్రకు తెర లేపుతుందని కేటీఆర్ అన్నారు. ఇదే కేంద్ర ప్రభుత్వం గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి మాత్రం నామినేషన్ పద్ధతిన భారీగా లిగ్నైట్ గనులు కేటాయించిన విషయాన్ని కేటీఆర్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. గుజరాత్ మాదిరిగానే తెలంగాణలోని సింగరేణికి బొగ్గు గనులను కేటాయించాలని ఎన్నోసార్లు తమ ప్రభుత్వం కోరినప్పటికీ కేంద్రం పెడచెవిన పెట్టిందన్నారు. తన సొంత రాష్ట్రం గుజరాత్ పై అపార ప్రేమను కనబరుస్తున్న దేశ ప్రధాని, ప్రగతిశీల తెలంగాణ రాష్ట్రం పట్ల మాత్రం వివక్ష చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.

సింగరేణిని ప్రైవేటీకరించమంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన ప్రకటలన్నీ కల్లబొల్లి మాటలేనని తేలిపోయిందని గుర్తుచేశారు. నవంబర్ 12 , 2022న రామగుండం పర్యటన సందర్భంగా సాక్షాత్తూ ప్రధానమంత్రే.. సింగరేణి బొగ్గుగనులను ప్రైవేటీకరించం అని మాటిచ్చి నిలుపుకోలేకపోయారని గుర్తుచేశారు. ప్రధాని.. హామీకే దిక్కులేకపోతే ఎలా అని సూటిగా ప్రశ్నించారు. ప్రధాని మరోసారి రాష్ట్రానికి రాబోతున్న తరుణంలో దానిపై ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. అటు ఉత్పత్తిలోనూ, లాభాల్లోనూ, పిఎల్ఎఫ్ లోనూ సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న సింగరేణిని ప్రైవేటీకరించాల్సిన అవసరం ఏమొచ్చిందో చెప్పే దమ్ము కేంద్ర ప్రభుత్వంలోనే ఏ ఒక్కరికైనా ఉందా అని నిలదీశారు.

సింగరేణి సంక్షోభంలోకి వెళితే దక్షిణ భారతదేశ థర్మల్ విద్యుత్ ఉత్పత్తి వ్యవస్థ కుప్పకూలుతుందనే సంగతి ప్రధానికి తెలియదా అని ప్రశ్నించారు.సింగరేణి ప్రైవేటీకరణ అనేది కేవలం ఆరు జిల్లాల సమస్య కాదని, సమస్త తెలంగాణ అంశమని, రాష్ట్ర ఆర్థిక ప్రగతిని దెబ్బతీసే భారీ కుట్రలో భాగంగానే ఇది జరుగుతోంది కేటీఆర్ చెప్పారు. రాష్ట్రంలోని రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్న సీఎం కేసిఆర్ గారి సంకల్పాన్ని ఎలాగైనా దెబ్బతీయాలన్న కేంద్రం కుట్ర ఇందులో దాగి ఉందని మండిపడ్డారు. బోర్లపై ఆధారపడ్డ అన్నదాతల బతుకులు మళ్లీ బోర్లాపడేలా చేయాలన్నదే బీజేపీ దురుద్దేశమని స్పష్టంచేశారు. రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రపంచవ్యాప్తంగా వస్తున్న గుర్తింపు, గౌరవాన్ని చూసి కేంద్ర ప్రభుత్వం ఓర్వలేకపోతోందన్నారు. విద్యుత్ ఉత్పత్తిని దెబ్బతీసి.. తద్వారా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు కరెంట్ లేకుండా చేయాలని కేంద్రం కుట్ర చేస్తోందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర థర్మల్ పవర్ జనరేషన్ లో సింగరేణి పాత్ర అత్యంత కీలకమైనదని, దేశంలో ఎక్కడా లేని విధంగా వ్యవసాయ రంగానికి, పరిశ్రమలకు, గృహ అవసరాలకు 24 గంటల పాటు ఇస్తున్న నాణ్యమైన విద్యుత్ సరఫరాను అడ్డుకోవాలన్న దురాలోచనతోనే కేంద్రం సింగరేణిపై కక్ష కట్టిందన్నారు. రైతులతోపాటు రాష్ట్రంలోని దళిత, గిరిజన, కులవృత్తులకు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్యుత్ ఫలాలను గండికొట్టాలని కేంద్రం చూస్తోందన్నారు అందుకే ఉచిత పథకాలను.. అనుచితాలని స్వయంగా ప్రధానమంత్రి ప్రకటించడం ఆయనకు పేదప్రజలపై ఉన్న కక్షపూరిత వైఖరిని వెల్లడిస్తుందన్నారు. కేంద్రం తీసుకొచ్చిన విద్యుత్ సంస్కరణలను తెలంగాణ బలంగా అడ్డుకోవడం, మోటర్లకు మీటర్లు పెట్టమని తెగేసి చెప్పడంతో కేంద్రం దొడ్డిదారిలో సింగరేణిపై కన్నేసిందని మండిపడ్డారు.

తెలంగాణకు సింగరేణి ఒక ఆర్థిక, సామాజిక జీవనాడిలాంటిదని అన్నారు. సింగరేణి ప్రైవేటీకరణ పై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గకుంటే జంగ్ సైరన్ మోగిస్తామని… మరో ప్రజా ఉద్యమం నిర్మిస్తామని హెచ్చరించారు. సింగరేణిని ప్రైవేటీకరించే కేంద్రం కుట్రలు ఫలిస్తే.. తెలంగాణ రాష్ట్రం చీకటిమయం అవుతుందని, సింగరేణి కార్మికులు శ్రమ దోపిడీకి గురవుతారని, వారసత్వ ఉద్యోగాలు, ఉద్యోగ భద్రత, నియామకాలలో రిజర్వేషన్లు, వారికిచ్చే బోనసులు, అలవెన్స్లు, ఇతర సంక్షేమ కార్యక్రమాలు పూర్తిగా రద్దు అవుతాయని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు.ఇప్పటికే సింగరేణిని ప్రైవేటీకరించే కుట్రలపైన ఉద్యోగులు, కార్మికుల పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారని, వారికి బీఆర్ఎస్ పార్టీ ప్రతిసారి అండగా ఉంటున్నదని కేటీఆర్ గుర్తుచేశారు. గతంలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం సింగరేణి నుంచే ఉవ్వెత్తున ఎగిసి గమ్యాన్ని ముద్దాడిందన్నారు. ఈ సారి పురుడుపోసుకునే మహోద్యమంతో.. కేంద్ర ప్రభుత్వం కుప్పకూలక తప్పదని మంత్రి కేటిఆర్ హెచ్చరించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bjp
  • breaking news
  • BRS
  • latest news
  • Minister KTR

తాజావార్తలు

  • Telangana Cabinet: ఇద్దరు మంత్రులకు ఉద్వాసన, ముగ్గురికి కొత్తగా అవకాశం..!

  • Iftar Dinner: నేడు ముస్లిం సోదరులకు వైసీపీ ఇఫ్తార్ విందు.. పాల్గొననున్న మాజీ సీఎం వైఎస్ జగన్!

  • Telangana Rain Alert: రాష్ట్రంలో ఈ నాలుగు రోజులు భారీ వర్షాలు.. ప్రజలకు కీలక హెచ్చరికలు!

  • 8.12 అంగుళాల ఫోల్డబుల్ డిస్‌ప్లే, 200MP కెమెరాతో OPPO Find N6 లాంచ్.. ధర ఎంతంటే?

  • Parents Smoking: తల్లితండ్రుల అలవాట్లు పిల్లల ఆరోగ్యంపై ప్రభావం.. కొత్త అధ్యనంలో షాకింగ్ విషయాలు..!

ట్రెండింగ్‌

  • Pomegranate Benefits: ప్రతిరోజూ ఒక దానిమ్మ పండు.. మీ శరీరానికి కలిగే అద్భుత ప్రయోజనాలు

  • Swaasa : మీ దగ్గు విని వ్యాధిని చెప్పేస్తుంది.! ఈ కొత్త AI టెక్నాలజీ గురించి తెలుసా.?

  • Ugadi Special : ఉగాది నాడు మనం వేప, బెల్లం ఎందుకు తింటామో మీకు తెలుసా?

  • Health Tips : బెండకాయతో కలిపి వీటిని అస్సలు తినకండి.. ఆరోగ్యానికి ప్రమాదకరం..!

  • Summer Tips : 40°+ ఎండలో కూల్‌గా ఉండాలంటే.. ఈ సమ్మర్ సీక్రెట్స్ ట్రై చేయండి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions