బ్రిటన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ మినిస్టర్ రనిల్ జయవర్ధన తో మంత్రి కేటీఆర్ సమావేశం నిర్వహించారు. విదేశీ పర్యటనలో వున్న మంత్రి కేటీఆర్ బిజీబిజీగా గడుపుతున్నారు. లండన్లోని మంత్రి జయవర్ధన కార్యాలయంలో జరిగిన సమావేశంలో మంత్రి కేటీఆర్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రభుత్వ విధానాలు, పారిశ్రామిక రంగంలో ప్రభుత్వం ప్రాధాన్యతలు వివరించారు.
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మౌలిక వసతులు, పెట్టుబడి అవకాశాలకు సంబంధించి, వివిధ అంశాలపైన ఆయనతో కలిసి చర్చించారు. తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే బయో ఏషియా సదస్సులో పాల్గొనాల్సిందిగా జయవర్ధనకు మంత్రి కేటీఆర్ ఆహ్వానం పలికారు. తెలంగాణ ప్రభుత్వానికి చెందిన ts-ipass విధానం గురించి తెలుసుకున్న బ్రిటన్ మంత్రి, ఈ విధానం పైన ప్రశంసలు కురిపించారు.
తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఇంగ్లండ్‌లో సర్పేస్ మెజెర్ మెంట్ సంస్థ ఎండీ మంత్రితో భేటీ అయ్యారుహైదరాబాద్‌లో 7 వేల చ.మీ. వైశాల్యంలో ల్యాబొరేటరీ ఏర్పాటు చేస్తామని సర్పేస్ మెజర్ మెంట్ సిస్టమ్స్ పేర్కొంది. రెండేళ్లలో దీనిని విస్తరిస్తామని సంస్థ తెలిపింది.
ఈ ల్యాబ్‌ను జాతీయ, అంతర్జాతీయ ఫార్మా కంపెనీల ఔషధ ప్రయోగాలకు వేదికగా చేస్తామని ఆ సంస్థ ఎండీ పేర్కొన్నారు. హైదరాబాద్‌లో సర్పేస్ మెజర్ మెంట్ సిస్టమ్స్ ల్యాబ్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చినందుకు మంత్రి కేటీఆర్ ఆ సంస్థకు ధన్యవాదాలు తెలిపారు..ఫార్మా రంగంలో హైదరాబాద్ ఎంతగానో పురోగమిస్తోందని మంత్రి వివరించారు. రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు వస్తాయని మంత్రి తెలిపారు.
Vijay: కేసీఆర్ తో తమిళ్ హీరో భేటీ.. ఏంటీ సంగతీ ..?