Site icon NTV Telugu

Minister KTR : కాంగ్రెస్, బీజేపీ అవినీతికి చిహ్నాలు

Ktr

Ktr

బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ కాంగ్రెస్, బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ, కాంగ్రెస్‌లు “ఏడు దశాబ్దాల స్వతంత్ర భారత చరిత్రలో దేశాన్ని దోచుకున్న దొంగ భాగస్వాములు” అని అభివర్ణించారు. రెండు పార్టీలు తమ అసమర్థ పాలన, అవినీతి పాలనతో చెడ్డపేరు తెచ్చుకున్నాయన్నారు. ట్విట్టర్‌ వేదికగా.. AICC అంటే.. “ఆలిండియా కరప్షన్ కమిటీ” అని, బీజేపీ అంటే”భ్రష్టాచార జనతా పార్టీ”కి పర్యాయపదంగా మారిందని మంత్రి కేటీఆర్‌ ట్విట్టస్త్రాలు సంధించారు. రెండు పార్టీల పాలనా వైఫల్యాలు దేశంతో పాటు తెలంగాణను శాపంగా వెంటాడుతూనే ఉన్నాయని పేర్కొన్నారు.

Also Read : Banana Benefits: అరటి పండు పరగడుపున తినొచ్చా?

బీఆర్‌ఎస్‌ను ఏఐఎంఐఎం మిత్రపక్షంగా పేర్కొంటూ బీజేపీ పరోక్ష వ్యూహాలను అవలంబిస్తున్నదని మంత్రి అన్నారు. అదేవిధంగా, బీఆర్‌ఎస్‌ను బీజేపీ మిత్రపక్షంగా పేర్కొంటూ కాంగ్రెస్‌ను అణగదొక్కాలని చూస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ తన భవిష్యత్తును వెన్నుపోటు పొడిచి, అటువంటి నిర్ణయానికి కాంగ్రెస్‌ను “వెన్నెముకలేని పార్టీ”గా అభివర్ణించారు. బీఆర్‌ఎస్ అంటే భారత రైతు సమితి అని పేర్కొన్న కేటీఆర్‌.. తెలంగాణ రైతులకు, ప్రజలకు పార్టీ నమ్మకమైన మిత్రపక్షమని పేర్కొన్నారు. “మా ప్రతి కార్యక్రమం సదుద్దేశంతో (దిల్దార్), నిర్ణయాలు దృఢ నిశ్చయం (దమ్‌దార్), ముఖ్యమంత్రి నిజాయితీ (ఇమాన్‌దార్), ప్రభుత్వం పూర్తి జవాబుదారీతనం (జిమ్మెదార్)” అని ఆయన అన్నారు. బీఆర్‌ఎస్‌ తొమ్మిదేళ్ల పరిపాలన ప్రశంసనీయం (జోర్దార్), తెలంగాణ అభివృద్ధి నమూనా జాతీయ స్థాయిలో (అసర్దార్) ప్రభావం చూపినందున రాబోయే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ధూంధాం (ధమకేదార్)గా ఉంటాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

Also Read : TTD: టీటీడీ కీలక నిర్ణయం.. 15 ఏళ్ల లోపు చిన్నారులకు మధ్యాహ్నం 2 వరకే అనుమతి

Exit mobile version