Minister KTR : సీఎం కేసీఆర్ జబర్దస్త్ గా ఉన్నాడు.. మనకోసం లోపల కూర్చొని అన్ని చేస్తున్నాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం భూపాలపల్లి జిల్లాలో పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ జబర్దస్త్ గా ఉన్నాడని, మనకోసం లోపల కూర్చొని అన్ని చేస్తున్నాడన్నారు. త్వరలో బయటికి వచ్చి అన్ని ప్రకటనలు చేస్తారన్నారు. సీఎం కేసీఆర్ తొమ్మిదిన్నర ఏళ్ళలో చేసిన పనులు మీ కళ్ళ ముందున్నాయని, ఒక్క ఛాన్స్ ఇవ్వండని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారన్నారు. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారో అడగండని, కాంగ్రెస్ అధికారం వస్తే మళ్లీ కష్టాలు వస్తాయని, రైతుబంధుకు రామ్ రామ్.. దళిత బందుకు జై భీమ్ అంటారన్నారు.
Also Read : Vijay Antony Daughter: నీ ఆలోచనలతో చచ్చిపోతున్నా.. నువ్వు లేకుండా ఉండలేను!
Also Read
- Antivenom: ఇక డోంట్ వర్నీ.. పామువిషానికి చెక్ పెట్టే సరికొత్త యాంటీవెనమ్ వచ్చేసింది!
- 7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
- Subramanyam Murder Case: డ్రైవర్ వీధి సుబ్రమణ్యం హత్య కేసులో కీలక పరిణామం..
- బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. Women's Asia Cup 2026 ఫైనల్‌కు టీమిండియా.!
అంతేకాకుండా.. ‘కాంగ్రెస్ హయాంలో ఉన్న దారిద్ర్యం మళ్ళీ వస్తోంది. ఈ ఎన్నికలు ఎమ్మెల్యే ఎన్నుకునేటివి కాదు.. మన కేసీఆర్ ను సీఎంగా ఎన్నుకునే ఎన్నికలు. కాంగ్రెస్ లో సీఎం అభ్యర్థి ఉన్నాడా? కేసీఆర్ తో పోటుపడేవారు ఈ రాష్ట్రంలో రాజకీయ పార్టీల్లో ఎవరున్న ఉన్నారా? కేసీఆర్ చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చిన నాయకుడు. కాంగ్రెసోళ్ళకు దిక్కు లేక డబ్బు సంచులతో నోట్ల కట్టలతో అడ్డంగా దొరికిన సన్నాసిని పట్టుకొని పీసీసీ పదవి ఇచ్చారు. ఆ మొగోడు చెబితే మనం ఓట్లేయాలట. సోనియమ్మని బలి దేవత అన్నాడు. 1200 మందిని బలి తీసుకున్నవారు దేవత కాదు బలిదేవత అన్నాడు. రాహుల్ గాంధీ ముద్దపప్పు అన్నాడు. ఇప్పుడు ముద్దపప్పుకాదు.. సుద్ద పప్పు అంటున్నాడు.. ఆయన మాటలు నమ్ముదామా? నోట్ల కట్టలతో అడ్డంగా దొరికిపోయిన థర్డ్ రేట్ దొంగ.. క్రిమినల్ అలాంటి వారి చేతిలో రాష్ట్రాన్ని పెడదామా?
Also Read : Israel Hamas War: పలు భూభాగాలను స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్.. 1,100కు చేరిన మృతుల సంఖ్య
మొన్న ఓటుకు నోటు ఈరోజు సీటుకో రేటు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కాదు రేటెంత రెడ్డి గా మారారు. ఆలాంటి వాళ్ళ చేతిలో రాష్ట్రాన్ని పెడితే ఆదానికో అంబానికి అమ్మేస్తాడు. కాంగ్రెస్ హామీలను చూసి మా కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. పులిని చూసి నక్కలు వాతలు పెట్టుకుంటే పులి అవుతుందా? రేపు మా పో పులి బయటికి వస్తుంది. కేసీఆర్ బయటికి వచ్చి ఏం చేయాలో ప్రజలకు చెబుతాడు. ప్రజలకు ఏ విధంగా న్యాయం చేయాలో తెలుసు. స్వయంగా ఆయనే చెబుతాడు. కేసీఆర్ క్రెడిబిలిటీ ఉన్న హిస్టరీ. ప్రజల మీద విశ్వాసం ఉన్న నాయకుడు… కాంగ్రెస్ చెప్పే మాటలు నమ్మద్దు. ఆగం కాకండి.. ఆలోచించి కారు గుర్తుకే ఓటు వేయండి. మోసాన్ని మోసాన్ని జయించాలి.. కాంగ్రెస్ వాళ్ళకు కర్నాటక నుంచి బిజేపి వాళ్ళకు గుజరాత్ నుంచి డబ్బులు వస్తున్నాయి. డబ్బులు ఇస్తే తీసుకొండి..ప్రమాణం చేయిస్తే తుపాల్ తుపాల్ అని నీకే వేస్తామని చెప్పండి. కళ్ళ ముందు అభివృద్ధి ఉంది.. గుండెనిండా సంక్షేమం ఉంది. ఆరు దశాబ్దాలుగా మోసం చేసి చావగొట్టినోడు మళ్ళీ వచ్చి ఏదో చెబుతే నమ్మి మోసపోకండీ.’ అని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Varun Tej Son: కొడుకు వాయువ్ ఫేస్ రివీల్ చేసిన వరుణ్ తేజ్.. క్యూట్‌నెస్‌కు ఫ్యాన్స్ ఫిదా!
-
Antivenom: ఇక డోంట్ వర్నీ.. పామువిషానికి చెక్ పెట్టే సరికొత్త యాంటీవెనమ్ వచ్చేసింది!
-
Flipkart Big Billion Days Sale 2026: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ఆరోజు నుంచే.. స్మార్ట్‌ఫోన్లు, టీవీలపై భారీ డిస్కౌంట్లు
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Israel vs Hamas: అక్టోబర్ 7 రహస్యం! ఆ 10 రోజుల్లో ఏం జరిగింది?
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?