NTV Telugu Site icon

Minister KTR : మోడీకి ఇష్టం లేకున్నా బెస్ట్ స్టేట్ తెలంగాణ అని చెప్పక తప్పదు

Ktr

Ktr

నేను ఛాలెంజ్ చేసి చెప్తున్న ఐఏఎస్ లను అడగండి వాళ్ళ స్వంత రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయో మన రాష్ట్రంలో ఎలా గ్రామాలు ఉన్నాయో అడగండంటూ వ్యాఖ్యానించారు మంత్రి కేటీఆర్. 12,769 గ్రామాలు, 142 మున్సిపాలిటీలు బాగు చేస్తే రాష్ట్రం బాగుపడుతుందని సీఎం కేసీఆర్ ఎప్పుడు చెప్తారన్నారు. పరిపాలన వికేంద్రీకరణ చేయాలని ముందే ముఖ్యమంత్రి ఆలోచన చేశారని, హరితహారం కార్యక్రమంలో 7.7 గ్రీన్ కవర్ తెలంగాణ మాత్రమే పెరిగిందని, దేశంలో ఎక్కడ లేదన్నారు. మోడీకి మనం అంటే ఇష్టం లేకున్నా దేశంలో బెస్ట్ స్టేట్ ఏది అంటే తెలంగాణ అని చెప్పక తప్పదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. అంతేకాకుండా.. ‘పర్యావరణ పరిరక్షణ ఒక్క సైడ్ అయితే మరో పక్కా పరిశ్రమలు నెలకొల్పుతున్నారు. 2014 లో మీ భూమి విలువ ఎంత ఇప్పుడు భూమి విలువ ఎంతనో గుండె మీద చెయ్యి వేసుకొని చెప్పండి. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా 10 లక్షలకు ఎకరా భూమి ఉందా…. ఎకరం భూమి 30 లక్షలకు తక్కువగా ఎక్కడ భూమి రావడం లేదు. ప్రతి పాడుపడ్డ బోర్ బావిని పల్లె ప్రగతిలో భాగంగా కూల్చిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ ది. ఇండియాలో 13 రాష్ట్రాల్లో అవినీతి పై సర్వే చేశారు. వీరు తేల్చింది ఏంది అంటే తెలంగాణ రాష్ట్రంలో అత్యంత తక్కువగా ఉందని తేల్చారు.

Also Read : Pakistan: పాకిస్తాన్‌లో హిందువుల ఆందోళన.. హిందూ బాలికలు, మహిళల కిడ్నాపులు, మతమార్పిడిపై నిరసన

ఆ 13 రాష్ట్రాల్లో గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు,కర్ణాటకతో పాటు పెద్ద రాష్ట్రాలు ఉన్నాయి. నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు ఓర్రుతారు వారికి నరం లేని నాలుక కాబట్టి ఎలనైన ఒర్రాలి కాబట్టి ఓర్రుతూన్నారు. ఇవాళ 1300 కోట్ల రూపాయలు ఇవాళ పల్లె ప్రగతి, నరేగా కింద విడుదల చేస్తున్నాం అన్నారు. నేను మంత్రిగా ఉన్నప్పుడు ఈ-పంచాయతీ అని స్టార్ట్ చేశాను అది ఇప్పుడు మళ్లీ స్టార్ట్ చేయాలి.12769 గ్రామాలకు కంప్యూటర్లు, ప్రింటర్లు ఇస్తాం. మోటర్లకు మీటర్లు పెట్టాలని పట్టు పట్టారు కానీ ముఖ్యమంత్రి గారు తెగేసి చెప్పారు మోటర్లకు మీటర్లు పెట్టేది లేదని చెప్పాము. మీటర్లు పెడితేనే 30 వేల కోట్లు ఇస్తాం అని చెప్పారు ఇంత సిగ్గుమాలిన విషయం ఇంకోటి ఉంటుందా. అవార్డులు వచ్చిన వారికి నిధులు ఎక్కువగా కూడా ఇవ్వాలని చెప్పాము. మంచి పని చేస్తే మళ్ళీ ఆశీర్వాదిస్తారు లేదంటే ఇంటికి పోతారు. గ్రామాల్లో సాంకేతిక పరిజ్ఞానం వాడుకొని ముందుకు పోవాలి.’ అని ఆయన అన్నారు.

Also Read : PM Modi: ప్రధాని డిగ్రీ వివరాలు అవసరం లేదు.. కేజ్రీవాల్‌కి హైకోర్టు జరిమానా..

Show comments