Minister KTR : లబ్ధిదారుల జాబితాలో కాంగ్రెస్, బీజేపీ నాయకులు కూడా ఉన్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కుత్బుల్లాపూర్, దుండిగల్‌లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ, ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పురపాలక శాఖ మంత్రి కే. తారకరామారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీ హైదరాబాద్ నగరంలో కట్టిన లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల విలువ 9700 వేల కోట్ల పైననే అన్నారు. కానీ మేము కట్టిన ఈ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల మార్కెట్ విలువ 50 నుంచి 60 వేల కోట్ల రూపాయలు ఉంటుందన్నారు మంత్రి కేటీఆర్. ఒక్క రూపాయి లంచం ఇవ్వాల్సిన అవసరం లేకుండా ఎవరి ప్రమేయం లేకుండా లబ్ధిదారులకు ఉచితంగా అందిస్తున్నామన్నారు మంత్రి కేటీఆర్. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికను అత్యంత పారదర్శకంగా కంప్యూటర్ ప్రోగ్రామ్ ఆధారంగా పూర్తి చేయడం జరుగుతున్నదని, లబ్ధిదారుల ఎంపికలు ప్రజాప్రతినిధుల పాత్ర లేదు. పేదలకి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అందితే చాలు అన్న కెసిఆర్ గారి మార్గదర్శనం మేరకు పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేశామన్నారు మంత్రి కేటీఆర్. లబ్ధిదారుల జాబితాలో కాంగ్రెస్, బీజేపీ నాయకులు కూడా ఉన్నారని, ఈరోజు 8 చోట్ల 13 వేలకు పైగా ఇండ్లను ఒక్కరోజే లబ్ధిదారులకు అందిస్తున్నామన్నారు కేటీఆర్.
Also Read : Ramachandra Reddy: టీడీపీ నేతలు రచ్చ కోసమే అసెంబ్లీకి వస్తున్నారు
Also Read
- IND Vs PAK: పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం.. ధావన్ హాఫ్ సెంచరీతో మెరుపులు..
- New Smart Phone: 9020mAH బ్యాటర్, 12GB RAM, AMOLED డిస్ప్లే.. విడుదలకు ముందే లీకైన ఫీచర్స్..
- YS Jagan: ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే అరెస్టులు: వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
- Attack On Pappu Yadav: ఎంపీ పప్పు యాదవ్‌పై కత్తితో దాడి.. హడలెత్తించిన దుండగులు..
అంతేకాకుండా.. ‘ఈరోజు జరిగిన ఇండ్ల పంపిణీ కార్యక్రమంతో దాదాపు 30 వేల ఇండ్లు లబ్ధిదారులకు అందించడం జరిగింది. మిగిలిన 70 వేల ఇళ్లను కూడా త్వరలో లబ్ధిదారులకు అందిస్తాం. ఒక్క లబ్ధిదారుడైన ఒక్క రూపాయి లంచం ఇచ్చే పరిస్థితి ఉంటే నేరుగా అధికారులకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ చెప్పాలి. భారతదేశంలో ఇంకా ఎక్కడైనా ఇంత పెద్ద పక్క డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టి పేదలకు ఇస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందా. పేదలకు ఉచితంగా ఇండ్లు కట్టించి ఇస్తున్న బిజెపి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రాష్ట్రంలో అయినా ఉన్నదా. దేశంలోనే అతిపెద్ద మురికివాడల అభివృద్ధి కార్యక్రమంగా ఈ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం నిలుస్తుంది. ఇంత పెద్ద డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్న జిహెచ్ఎంసి అధికారులకు అభినందనలు. కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే పేదలకు న్యాయం జరుగుతున్నది. వారి జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయి. పేదల పైన, రైతుల పైన కెసిఆర్ కన్నా అత్యంత ప్రేమ కలిగిన నాయకుడు దేశంలో ఎవరూ లేరు. పనిచేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని ప్రజలను కోరుతున్నాను. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి అందించలేని కొన్ని పార్టీలు ఈరోజు అడ్డగోలు వాగ్దానాలు చేస్తున్నాయి. ఢిల్లీ నుంచి, బెంగళూరు నుంచి వచ్చి అడ్డగోలు వాగ్దానాలు చేస్తున్న వారి మాటలు నమ్మాల్సిన అవసరం లేదు. సంక్రాంతికి ముందు గంగిరెద్దులు వచ్చినట్లు ఎన్నికల ముందు వచ్చి బూటకపు హామీలు ఇచ్చే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి.’ అని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు.
Also Read : Manchu Lakshmi: మరోసారి మంచు లక్ష్మిపై ట్రోలింగ్.. ఈసారి ఏకంగా వ్యక్తిపై చేసుకుని?
తాజావార్తలు
-
Uttar Pradesh Crime: నిద్రమాత్రల మత్తులోకి నెట్టేసి, చీరతో గొంతు బిగించి చంపింది.. భర్తలకు రక్షణ లేదా?
-
Nutrition Tips : అన్నంలో నెయ్యి.. ఆరోగ్య రహస్యం.!
-
IND Vs PAK: పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం.. ధావన్ హాఫ్ సెంచరీతో మెరుపులు..
-
Vegetable Cleaning : కూరగాయలను ఉప్పు నీటితో కడుగుతున్నారా.? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.!
-
New Smart Phone: 9020mAH బ్యాటర్, 12GB RAM, AMOLED డిస్ప్లే.. విడుదలకు ముందే లీకైన ఫీచర్స్..
ట్రెండింగ్
-
Car Maintenance: కారులో ఎలుకల బెడదా? ఈ 5 చిట్కాలతో వేల రూపాయల నష్టాన్ని తప్పించుకోండి.!
-
Door Mat Cleaning : డోర్‌మ్యాట్ ఇలా వాష్ చేస్తే చాలు.. దుమ్ము, దుర్వాసన, క్రిములు మాయం.!
-
Oil-Free Poori: చుక్క నూనె లేకుండా పూరీలు.. చేసేయండి ఇలా..!
-
Airtel యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.1,849 ప్లాన్‌తో ఏడాది పాటు అన్ లిమిటెడ్ కాల్స్..!
-
120dB స్పీకర్, IP64 రేటింగ్‌తో JioTag 2 లాంచ్.. ధర ఎంతంటే..?