దసరా ఉత్సవాల సందర్భంగా గతంలో లేని విధంగా విజయవాడ ఇంద్రకీలాద్రి భక్తులతో పోటెత్తింది. భక్తుల తాకిడి నేపథ్యంలో వీఐపీల దర్శనాల విషయంలో గందరగోళం ఏర్పడింది. మూలా నక్షత్రం సందర్భంగా నిన్న రికార్డ్ స్థాయిలో భక్తులు ఇంద్రకీలాద్రికి వచ్చారన్నారు దేవాదాయ మంత్రి కొట్టు సత్యనారాయణ. కొండపైన ఆలయంలో చిన్న చిన్న ఇబ్బందులు జరిగిన మాట వాస్తవమేనని ఆయన అంగీకరించారు. అంచనాకి మించి భక్తులు దుర్గమ్మను దర్శించుకున్నారన్నారు. చివరి వ్యక్తికి కూడా దర్శన భాగ్యం కల్పించామన్నారు మంత్రి.
వృద్దులు,వికలాంగులకు కేటాయించిన టైం స్లాట్ లో మాత్రమే రావాలి.. మామూలు సమయంలో వచ్చి ఇబ్బంది పడవద్దు. ఈసారి తెప్పోత్సవానికి ఇంకా ఇరిగేషన్ నుంచి అనుమతి రాలేదు. వరద ప్రవాహం ఎక్కువగా ఉంటే హంస వాహనాన్ని ఒకచోటే నిలిపి ఉత్సవాన్ని నిర్వహిస్తాము. ఇప్పటివరకు ఉత్సవాలు ప్రశాంతంగా జరిగాయి. రేపు ఎల్లుండి భవానీ మాల ధారణ వేసిన భక్తులు ఎక్కువగా వస్తారు. వారికి తగ్గట్టుగా ప్రసాదాలు కూడా ఎక్కువగా సిద్ధం చేస్తున్నాం అని మంత్రి తెలిపారు. దసరా రోజున దుర్గమ్మ తెప్పోత్సవం రద్దయ్యే అవకాశం వుందని తెలుస్తోంది.
పులిచింతల నుంచి లక్ష క్యూసెక్కుల నీరు ప్రకాశం బ్యారేజ్ కి విడుదల అయింది. సాధారణంగా 30వేల క్యూ సెక్కుల లోపు ఇన్ ఫ్లో ఉంటేనే జల వనరుల శాఖ దుర్గమ్మ తెప్పోత్సవం కార్యక్రమానికి అనుమతి ఇస్తుంది. ఇవాళ సాయంత్రం జరిగే సమన్వయ కమిటీ సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం వుందని తెలుస్తోంది. గడచిన ఏడాది వరదల కారణంగా వేద పండితులను మాత్రమే అనుమతించిన అధికారులు..ఈ సారి ఏంచేయాలనేదానిపై కాసేపట్లో తుదినిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. సాధారణంగా దుర్గమ్మ తెప్పోత్సవం కోసం భక్తులు ఎదురుచూస్తుంటారు.
Read Also: Devaragattu Bunny Festival: దేవరగట్టు కర్రల సమరానికి అంతా సిద్ధం
ఇంద్రకీలాద్రిపై దర్శనాల రచ్చ
పోలీసుల వ్యవహార శైలిపై ఈవో సీరియస్ అయ్యారు. రంగంలోకి దిగి వీఐపీ ఎంట్రీ పాయింట్ దగ్గర కూర్చున్నారు ఈవో. వీఐపీ తరహాలో నేరుగా దర్శనాలకు వెళుతున్న పోలీసు కుటుంబాల తీరుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నో టికెట్స్ , నో క్యూలైన్స్ , నోరూల్స్ అంటూ పోలీసు కుటుంబాల వారు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. డ్యూటీ పేరుతో దర్శనాలకు కుటుంబాలతో క్యూ కడుతున్నారు పోలీసులు. గంటల తరబడి క్యూలైన్స్ లో భక్తులు కిటకిట లాడుతుంటే.. ఇలా అడ్డదారిలో దర్శనాలు చేసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రూ.500 టికెట్ కొన్న భక్తులకు సైతం వెయిటింగ్ తప్పడం లేదు. ప్రోటోకాల్ వుండి మేమే క్యూ లైన్ లో వెళ్తుంటే పోలీసులు నేరుగా ఎలా వెళ్తారంటూ మండిపడుతున్నారు భక్తులు. రాజ మార్గంలో నిమిషాల్లో తమ కుటుంబ సభ్యులకు దర్శనాలు ఇప్పిస్తున్న పోలీసుల తీరుపై అధికారులు నోరుమెదపడం లేదు.
Read Also: Svante Paabo: వైద్యశాస్త్రంలో పాబోకు ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారం