Kottu Satyanarayana: కాపులను వాడుకుని వదిలేయలని పవన్ చూస్తున్నాడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kottu Satyanarayana: వారాహి యాత్ర ప్రారంభించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సీఎం వైఎస్ జగన్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.. ఇక, అదేస్థాయిలో వైసీపీ నుంచి పవన్‌కు కౌంటర్లు పడుతున్నాయి.. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో మీడియాతో మాట్లాడిన మంత్రి కొట్టు సత్యనారాయణ.. పవన్ అర్థంపర్ధం లేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.. అత్యధిక కాపులు ఉండే ప్రాంతానికి వెళ్లి కాపులను తిట్టడం మంచి పద్ధతి కాదని హితవుపలికిన ఆయన.. పవన్ తెలివి తేటలు ప్రదర్శిస్తున్నారో.. అతి తెలివి చూపిస్తున్నారో తెలియని పరిస్థితి ఉందన్నారు.. కాపు రిజర్వేషన్లు ఇస్తామని నువ్వు గానీ, నీ దత్త తండ్రి గానీ చెప్పగలరా..? అంటూ పవన్‌ను నిలదీశారు.
Read Also: MVV Satyanarayana Family: విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య, కుమారుడు కిడ్నాప్
Also Read
పవన్ కల్యాణ్, చంద్రబాబులను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు.. అందుకే గత ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడించారని తెలిపారు మంత్రి కొట్టు.. కాపుల రిజర్వేషన్ కోసం ముద్రగడ పోరాటం చేస్తే తట్టుకోలేక చంద్రబాబు రైలు తగలబెట్టి.. కేసుల్లో ఇరించారని విమర్శించారు.. కానీ, ఆ విషయం పవన్‌కు తెలియదా? అని ప్రశ్నించారు.. కాపులను వాడుకుని వదిలేయాలని చూడటం, చంద్రబాబుకి కాపులను తాకట్టు పెట్టాలని పవన్ కల్యాణ్ చూస్తున్నారంటూ ఆరోపించారు మంత్రి కొట్టు సత్యనారాయణ. కాగా, పవన్ కల్యాణ్ అనేవాడు అసెంబ్లీలో అడుగుపెట్టకుండా చేయాలని తనపై కక్షగట్టారని పవన్ ఆరోపించిన విషయం విదితమే.. ప్రజల్ని బాగా చూసుకుంటానంటే వైసీపీతో తనకు ఇబ్బంది లేదన్నారు. ఒక్క సీటు కూడా లేని జనసేనను వైసీపీ నేతలు టార్గెట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాట్లాడితే క్లాష్‌వార్ అంటాడని.. ఎప్పుడూ నవ్వుతూ వుంటాడని సీఎం జగన్‌పై విమర్శలు గుప్పించారు. పార్టీని నడపటానికే తాను సినిమాలు చేస్తున్నానని పవన్ వ్యాఖ్యానించిన విషయం విదితమే.
తాజావార్తలు
-
OTR : తెలంగాణ బీజేపీకి కొత్త సారథి? మళ్లీ బండి సంజయ్‌కే పగ్గాలు!
-
Story Board : బంగ్లా మరో పాకిస్తాన్ లా మారుతుందా..?
-
Indiramma Houses: ఇందిరమ్మ ఇండ్లకు ఫుల్ డిమాండ్.. 7,340 ఇళ్లకు 35 వేల దరఖాస్తులు!
-
Russia-India Rail Route: భారత్‌కు రైల్వే మార్గం.. రష్యా కీలక ప్రతిపాదన..
-
Lionel Messi’s Father Passed Away: మెస్సీ కన్నీళ్ల వెనుక అసలు కారణం ఇదేనా? తండ్రి జార్జ్ ఇక లేరు
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!