NTV Telugu Site icon

Minister Kottu Satyanarayana: బాబు పాలనలో చేసిన పనుల వల్లే రాష్ట్రంలో దుర్భిక్షం ఏర్పడింది..

Kottu Satyanarayana

Kottu Satyanarayana

Minister Kottu Satyanarayana: చంద్రబాబు చేసిన పనులకు తగిన శాస్తి జరిగిందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. ఆలయాలను జగన్ తిరిగి నిర్మిస్తున్నారని ఆయన తెలిపారు. విజయవాడలో ఇంద్రకీలాద్రిలోని మహా మండపం, పాత మెట్ల వద్ద పునః నిర్మించిన వినాయక, ఆంజనేయ స్వామి ఆలయం వద్ద విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో మంత్రి కొట్టు సత్యనారాయణ పాల్గొన్నారు. చంద్రబాబు పాలనలో ఆయన చేసిన పనుల వల్లే రాష్ట్రంలో దుర్భిక్షం ఏర్పడిందని మంత్రి విమర్శించారు. ఓట్ల కోసం మా పథకాలనే పవన్, బాబు తప్పుపట్టారన్నారు. 8 ఆగమాలతో జగన్ సంకల్పించిన యజ్ఞం విజయవంతం అయిందని.. జగన్ సంకల్పంతో రాష్ట్రంలో కాసుల వర్షం కురుస్తోందని, ప్రజలు సుభిక్షంగా వున్నారన్నారు.

Read Also: Perni Nani: చంద్రబాబును పాతాళానికి తొక్కేది పవన్ కల్యాణ్ మాత్రమే..

సభ ప్రారంభమైన 5:30 వరకూ కూచున్నారంటే జనం లేకనే కదా అంటూ మంత్రి విమర్శలు గుప్పించారు. నోటికొచ్చిన భాషతో ప్రజలు అసహ్యించుకుంటారనే ఆలోచన లేకుండా మాట్లాడారని పవన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్ కాపుల పరువు తీసేసాడని ఆయన అన్నారు. దిగజారిపోయి మాట్లాడటం సరికాదని హరి రామజోగయ్య చూపుతూనే ఉన్నాడన్నారు. కాపులందరికీ పవన్ సమాధానం కారం రాసినట్టుగా ఉందన్నారు. పవన్ చంద్రబాబుకి వార్నింగ్ ఇచ్చాడా.. మూడో అడుగు చంద్రబాబు నెత్తిన పెట్టమంటాడేమో అంటూ ఎద్దేవా చేశారు. పవన్ వ్యాఖ్యలకి అందరూ నొచ్చుకుంటున్నారని.. టీడీపీ కార్యకర్తలకు తలొగ్గి ఉండాలని పవన్ చెప్పడంతో కాపులు సిగ్గుపడ్డారన్నారు. పవన్ కల్యాణ్‌తో కలిసి నడిచేందుకు కాపులు సిద్ధంగా లేరన్నారు.