Kakani Govardhan Reddy: శాసన సభలో టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రవర్తనపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి.. టీడీపీ సభ్యుల ఆందోళనతో అసెంబ్లీ వాయిదా పడడంతో మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడుతూ.. బాలకృష్ణ రీల్ హీరో.. జగన్ మోహన్ రెడ్డి రియల్ హీరో అని అభివర్ణించారు. అయితే, రీల్ హీరోలు సభలో తొడలు కొడితే రియల్ హీరోలు అయిపోరు అంటూ ఎద్దేవా చేశారు.. చంద్రబాబు 370 కోట్లు దోచుకుని అడ్డంగా దొరికిపోయాడు అని మండిపడ్డారు. 14 ఏళ్లు సీఎంగా చేశాడు కాబట్టి చంద్రబాబు దోచుకోవడానికి అర్హుడు అనేలా టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. సభలో చర్చ జరగకుండా టీడీపీ నేతలు ఎందుకు పారిపోతున్నారు? అని నిలదీశారు.
Read Also: Peddakapu :’పెదకాపు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా ఆ హీరో?
ఇక, అనుచితమైన ప్రవర్తనతో వ్యవహరించేవాడు అసలు నటుడే కాదు అంటూ బాలయ్యపై మండిపడ్డారు కాకాణి.. దేవాలయం వంటి అసెంబ్లీలో తాను చేసిన పనికి ఒక కళాకారుడిగా బాలకృష్ణ సిగ్గుపడాలన్న ఆయన.. టీడీపీ నేతలకు ఇదే నా సవాల్.. మీరు నీతిమంతులైతే.. దమ్ము, ధైర్యం ఉంటే రండి చర్చిద్దాం.. చంద్రబాబు దోపిడీ పై వివరింగా చర్చిద్దాం.. మా ప్రశ్నలకు సమాధానం చెప్పండి.. ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌పై పూర్తి స్థాయిలో చర్చిద్దాం అంటూ టీడీపీ సభ్యులకు చాలెంజ్ విసిరారు మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి. కాగా, వాయిదా అనంతరం సభ తిరిగి ప్రారంభమైనా.. టీడీపీ సభ్యుల ఆందోళన కొనసాగింది. దీంతో.. రెండోసారి కూడా అసెంబ్లీని వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు స్పీకర్ తమ్మినేని సీతారాం.
