Site icon NTV Telugu

Kakani Govardhan Reddy: దళితులంటే ముందునుంచి చంద్రబాబుకు చిన్న చూపే: మంత్రి కాకాని

Kakani Govardhan Reddy

Kakani Govardhan Reddy

దళితులంటే ముందునుంచి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు చిన్న చూపే అని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. డా. బీఆర్ అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు సీఎం జగన్ హామీ ఇచ్చి.. అమలు చేశారన్నారు. జనవరి 8 నుంచి 19 వరకూ మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో కార్యక్రమాలు నిర్వహిస్తాం అని మంత్రి కాకాని తెలిపారు. నెల్లూరులోని వైసీపీ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నేతల సమావేశం జరిగింది. జనవరి 19న అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా కార్యక్రమాల నిర్వహణపై చర్చ సాగింది.

సమావేశంలో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్యే మహిదర్ రెడ్డి, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ చిరంజీవి రెడ్డి, జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ సత్యనారాయణ రెడ్డి, వైసీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు కామరాజు పాల్గొన్నారు. సమావేశం అనంతరం మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ… ‘విజయవాడలోని స్వరాజ్ మైదానంలో డా. బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి జగన్ ఆవిష్కరించనున్నారు. అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించే ప్రాంతాన్ని టూరిస్ట్ స్పాట్ గా అభివృద్ధి చేస్తున్నాం. అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుపై చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చి అమలు చేయలేదు. దళితులంటే ముందునుంచి చంద్రబాబుకు చిన్న చూపే’ అని విమర్శించారు.

Also Read: Soft water Jobs Fraud: సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం ఇప్పిస్తానంటూ టోకరా.. లక్షలు గుంజిన వ్యక్తి!

‘డా. బీఆర్ అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు సీఎం జగన్ హామీ ఇచ్చి అమలు చేశారు. జనవరి 8 నుంచి 19 వరకూ మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో కార్యక్రమాలు నిర్వహిస్తాం. జిల్లాలోని అంబేద్కర్ విగ్రహాలను సుందరంగా తీర్చి దిద్దుతాం. వివిధ పోటీలు నిర్వహించి బహుమతులు ఇస్తాం. చర్చా వేదికలు ఏర్పాటు చేసి అంబేద్కర్ సేవలను ప్రజల్లోకి తీసుకెళతాం’ అని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు.

Exit mobile version