Site icon NTV Telugu

Kakani Govardhan Reddy: అబద్ధానికి ప్యాంటు, షర్టు వేస్తే అదే చంద్రబాబు..!

Kakani On Cbn

Kakani On Cbn

Kakani Govardhan Reddy: టీడీపీ అధినేత చంద్రబాబుపై ఓ రేంజ్‌లో ఫైర్‌ అయ్యారు మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి.. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. అబద్ధానికి షర్టు, ప్యాంటు వేస్తే చంద్రబాబులా ఉంటుందని విమర్శించారు.. చంద్రబాబు జీవితం అబద్ధాలమయం.. జీవితంలో ఎప్పుడూ నిజాలు చెప్పని వ్యక్తి చంద్రబాబు.. ప్రపంచంలో ఏ మంచి జరిగినా అన్ని తన ఖాతాలో వేసుకోవడం ఆయనకు అలవాటు.. హైదరాబాదులో మైక్రోసాఫ్ట్ పెట్టాను కాబట్టి సత్య నాదేళ్ల సీఈవోగా ఎదిగారని చంద్రబాబు చెప్పారు.. ఇంతకన్నా పచ్చి అబద్ధం వేరేది ఉందా? 1992లోనే మైక్రోసాఫ్ట్ లో సత్య నాదెళ్ల చేరారు.. అప్పటికి ఇంకా చంద్రబాబు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాలేదు.. మైక్రోసాఫ్ట్ హైదరాబాద్‌కు రాలేదు.. ఇది అందరికీ తెలిసినా.. అబద్దాలు చెప్పడంలో చంద్రబాబు మాత్రం ఆగడంటూ మండిపడ్డారు.

Read Also: International Driving Licence : అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ ఎలా పొందాలి?

ఏమి జరిగినా అంతా తనవల్లే అని చెప్పుకోవడం చంద్రబాబుకు అలవాటు అని సెటైర్లు వేశారు మంత్రి.. దేశంలో జాతీయ రహదారులు వేసే విషయం కూడా తానే వాజ్‌పేయ్‌కు చెప్పానని కూడా చంద్రబాబు చెప్పుకుంటున్నారు.. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు మాట్లాడిన విషయం చూస్తే ఆయన ఇంగ్లీష్ ఎలా ఉంటుందో తెలుస్తుందని.. చంద్రబాబు లాగా ఇంగ్లీష్ మాట్లాడితే మన పిల్లలు అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తారా..? మన పిల్లలకు మంచి భవిష్యత్తు ఇచ్చేందుకు ఇంగ్లీష్ మీడియంను జగన్ తీసుకొస్తే దానిపై విమర్శలు చేస్తున్నారు అని మండిపడ్డారు. వైసీపీ మీద చార్జిషీట్‌ వేయడానికి టీడీపీ నేతలకు ఏం అర్హత ఉంది అని నిలదీశారు కాకాణి.. టీడీపీ నేతల లాగా మేనిఫెస్టోను దాచలేదు.. ఇంటర్నెట్ నుంచి తొలగించలేదు.. మేనిఫెస్టోను చేతిలో పట్టుకుని ఇంటింటికి వెళ్లి ఏ ఏ పథకాలు వచ్చాయి అనే విషయాన్ని ఆరా తీస్తున్నాం అని వివరించారు. చంద్రబాబు ఏ రోజైనా మేనిఫెస్టోకు సంబంధించి మాట్లాడారా? 650 వాగ్దానాలు ఇచ్చి 10 శాతం కూడా అమలు చేయలేదు అని ఆరోపించారు. కానీ, మేం నవరత్నాలు ఇస్తామని చెప్పి అన్నీ అమలు చేస్తున్నాం.. టీడీపీ నేతలు కోరుకున్న గ్రామానికి వెళదాం.. కుప్పం లేదా టెక్కలికి వెళ్లి చూద్దాం.. టీడీపీ మేనిఫెస్టో.. వైసీపీ మేనిఫెస్టో ఏవిధంగా అమలైందో చూద్దాం అంటూ సవాల్‌ చేశారు. చంద్రబాబు, అచ్చెన్నాయుడుకు చీము, నెత్తురు ఉంటే నా సవాల్ ను స్వీకరించాలి.. ఛాలెంజ్‌ చేశారు మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి.

Exit mobile version