NTV Telugu Site icon

Minister Jogi Ramesh: రాబోయే ఎన్నికల్లో 175 స్థానాలు గెలిచి తీరుతాం..

Jogi Ramesh

Jogi Ramesh

Minister Jogi Ramesh: మంగళగిరి వైసీపీ అడ్డా.. అభ్యర్థి ఎవరైనా గెలిచేది వైసీపీ అభ్యర్థేనని మంత్రి జోగి రమేష్ అన్నారు. మంగళగిరి సామాజిక సాధికార ముగింపు సభలో ఆయన ప్రసంగించారు. లోకేష్‌ను మడత పెట్టేస్తాం, టీడీపీని కృష్ణానదిలో కలిపేస్తామని ఆయన అన్నారు. మంగళగిరిలో గంజి చిరంజీవి గెలిస్తే సామాజిక న్యాయం గెలిచినట్లు, వైఎస్ జగన్ గెలిచినట్లు అని మంత్రి తెలిపారు. మంగళగిరి పేరు తెలియని వాడికి మంగళగిరి సీటు ఎందుకు అని ఆయన ప్రశ్నించారు. జగనన్న కట్ అవుట్ చాలు మంగళగిరిలో వైసీపీ గెలవడానికి అంటూ వ్యాఖ్యానించారు. 17 మందితో ఎస్సీ, బీసీ, మైనారిటీల మంత్రి వర్గం ఏర్పాటు చేసిన ఘనుడు సీఎం జగన్ అని ఈ సందర్భంగా చెప్పారు.

Read Also: YSRCP 5th List: వైసీపీ ఐదో జాబితా విడుదల.. ఎంపీ అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్

సామాజిక న్యాయం చేయాలంటే మంగళగిరిలో టీడీపీ బీసీ అభ్యర్థిని నిలపాలని ఆయన సవాల్ విసిరారు. పవన్, చంద్రబాబు కాదు, పది మంది కలిసి వచ్చినా జగన్ సింగిల్‌గా గెలుస్తాడన్నారు. సొంత సామాజిక వర్గానికి రాజ్యసభ స్థానాన్ని అమ్ముకున్న వ్యక్తి చంద్రబాబు అంటూ ఆయన ఆరోపించారు. రాజ్య సభకు కూడా ఎస్సీ, బీసీ మైనార్టీలను పంపిస్తున్న నాయకుడు సీఎం జగన్ అని పేర్కొన్నారు. ఏపీలో ఆధార్ కార్డు లేని చంద్రబాబు, పవన్, లోకేష్ లాంటి వాళ్ళు ఆంధ్రాలో రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్‌లో తిండి తిని ఏపీలో విషం కక్కుతున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో 175 స్థానాలు గెలిచి తీరుతామని మంత్రి జోగి రమేష్ అన్నారు.