S. Jaishankar: అరుణాచల్‌ప్రదేశ్ భారత్‌లో అంతర్భాగమే.. చైనా కొత్త మ్యాప్‌పై మంత్రి కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చైనా సోమవారం రిలీజ్ చేసిన కొత్త మ్యాప్ ను చైనా వార్తాపత్రిక గ్లోబల్ టైమ్స్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X (ట్విట్టర్)లో పోస్ట్ చేసింది. అందులో తమ భూభాగంలో భారతదేశ ప్రాంతాలను చూపించింది. ఈ వ్యూహంపై విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ స్పందించారు. అసంబద్ధమైన వాదనలు చేయడం ద్వారా ఇతరుల భూభాగం మీది కాదన్నారు. ఓ వార్త ఛానల్ లో ఆయన మాట్లాడుతూ.. చైనాకు ఇలాంటి మ్యాప్‌లను జారీ చేసే అలవాటు ఉందని.. మీ అధికారిక మ్యాప్‌లో ఇతర దేశాల భూభాగాలను చేర్చడంలో అర్థం లేదని జైశంకర్ అన్నారు. చైనా.. భారతదేశానికి చెందిన ప్రాంతాలతో మ్యాప్‌ను విడుదల చేసిందని.. ఇది పాత అలవాటేనని.. కేవలం భారతదేశంలోని కొన్ని ప్రాంతాలతో మ్యాప్‌ను విడుదల చేయడం వల్ల ఎలాంటి మార్పు ఉండదని, తమ ప్రభుత్వం ఈ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. అసంబద్ధమైన దావాలు చేయడం వల్ల ఇతరుల ప్రాంతం మీది కాదని వ్యాఖ్యానించారు.
Read Also: KA Paul: విశాఖలో సీఐ కాలర్ పట్టుకుని కేఏ పాల్ ఓవరాక్షన్
Also Read
- Rishabh Pant Fined: విజయం సాధించినా.. LSG కెప్టెన్ కు తప్పని భారీ ఫైన్..!
- TDP vs YSRCP: టెంపుల్ సిటీలో టెన్షన్.. టెన్షన్.. టీడీపీ వర్సెస్ వైసీపీ
- Hyderabad Cyber Crime: దేశవ్యాప్తంగా సైబర్ క్రైమ్ పోలీసుల ఆపరేషన్.. సిమ్‌లు సరఫరా చేస్తున్న ముఠాల గుట్టురట్టు
- Story Board: మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
చైనా జారీ చేసిన ప్రామాణిక మ్యాప్‌ను భారత్ తిరస్కరించింది. ఇందులో 1962 యుద్ధంలో ఆక్రమించిన అరుణాచల్ ప్రదేశ్‌ను దక్షిణ టిబెట్‌గా చైనా పిలుస్తుంది. అయితే అక్సాయ్ చిన్ కూడా దాని యాజమాన్యాన్ని పేర్కొంది. అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలో అంతర్భాగమని, భవిష్యత్తులో కూడా అది భారతదేశంలో భాగమేనని భారత్ చెబుతోంది. వచ్చే వారాంతంలో న్యూఢిల్లీలో జరగనున్న జీ20 సదస్సు, గత వారం దక్షిణాఫ్రికాలో జరిగిన బ్రిక్స్ సదస్సు తర్వాత చైనా ఈ మ్యాప్‌ను విడుదల చేయడం గమనార్హం. చైనా మ్యాప్‌లో చేర్చబడిన ఇతర వివాదాస్పద ప్రాంతాలలో తైవాన్ మరియు దక్షిణ చైనా సముద్రంలోని పెద్ద భాగాలు ఉన్నాయి.
తాజావార్తలు
-
Rishabh Pant Fined: విజయం సాధించినా.. LSG కెప్టెన్ కు తప్పని భారీ ఫైన్..!
-
Gold and Silver Rates: కమింగ్ డౌన్.. నేడు మళ్లీ పతనమైన గోల్డ్, సిల్వర్ ధరలు..
-
TDP vs YSRCP: టెంపుల్ సిటీలో టెన్షన్.. టెన్షన్.. టీడీపీ వర్సెస్ వైసీపీ
-
Vrushakarma: ‘వృషకర్మ’ నుంచి సాలిడ్ అప్డేట్..
-
India Unemployment: ఆరు నెలల గరిష్ఠానికి చేరిన భారత నిరుద్యోగ రేటు.. ఏప్రిల్‌లో 5.2% శాతానికి
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..