Site icon NTV Telugu

Jagadish Reddy: మోడీ రైలు ఓపెనింగ్‌కు వచ్చి.. తెలంగాణపై విషం చిమ్మారు..

Jagadish Reddy

Jagadish Reddy

Minister Jagadish Reddy: ప్రధాని మోడీ వందేభారత్‌ రైలు ప్రారంభోత్సవానికి వచ్చి.. తెలంగాణపై విషం చిమ్మారని మంత్రి జగదీశ్ రెడ్డి విమర్శించారు. తెలంగాణపై మోడీకి విద్వేషం ఎందుకని ఆయన ప్రశ్నించారు. ఇవాళ్టికి కూడా గుజరాత్‌లో ఇంటింటికి మంచి నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదని .. తెలంగాణ అభివృద్ధిని చూసి మోడీ ఓర్వలేకపోతున్నారని మంత్రి అన్నారు. మోడీ సభలో ప్రజలను మోసం చేసే పద్ధతిలో మాట్లాడారని ఆయన చెప్పారు. ప్రధాని స్థాయిలో మోడీ సభలో మాట్లాడలేదని.. కేసీఆర్‌ను చూసి మోడీకి ఎందుకు భయం అంటూ ప్రశ్నించారు.

Read Also: PM Modi : బీజేపీ స్టేట్ ఆఫీస్ సిబ్బంది అందరినీ కలిసిన ప్రధానమంత్రి

మోడీకి విజన్ లేదని.. చెప్పుకోవడానికి విజయాలు లేవని మంత్రి వ్యాఖ్యానించారు. బండి సంజయ్ మాటలకు…మోడీ మాటలకు తేడా లేదని ఆయన పేర్కొన్నారు. మోడీ పర్యటన వల్ల తెలంగాణకు ఏం ఉపయోగం లేదన్నారు. ఇతర పార్టీల నేతలకు సీబీఐ ,ఈడీ నోటీసులు పంపుతుందన్న మంత్రి.. బీజేపీలో చేరితే అవి ఉండవని ఎద్దేవా చేశారు. మోడీ ప్రభుత్వం …అవినీతి ప్రభుత్వమని ఆయన ఆరోపించారు. తెలంగాణలో అభివృద్ధి.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అవినీతి ఉందని ఆయన ఆరోపణలు చేశారు

Exit mobile version