తెలంగాణలో కురిసిన వర్షాలు, వరద ప్రభావంపై కాంగ్రెస్, బీజేపీ నాయకులు బురద రాజకీయాలు చేస్తున్నారని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ నాయకులు వరదలపై గవర్నర్ ను కలవడాన్ని ఆయన తప్పుబట్టారు. కేంద్రం నుంచి సహాయం తీసుకురాకుండా ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాలను జగదీష్ రెడ్డి ఖండించారు. బీజేపీకి తోక పార్టీ అనేది నిజమనేలా కాంగ్రెస్ ప్రవర్తిస్తుందని ఆయన ఆరోపించారు.
Read Also: Tiger Nageswara Rao: ఈ గజదొంగను ఆపుతున్న శక్తులు ఎవరు.. అదికూడా చెప్పండి బ్రో
గవర్నర్ తమిళిసై బీజేపీ నాయకురాలిగా ప్రవర్తిస్తున్నారు.. ఆమెను వరదల సందర్శనకు రమ్మనడం కాంగ్రెస్ పార్టీ దివాలకోరు తనానికి నిదర్శనమని మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ బీజేపీ కి ప్రత్యామ్నాయం అయితే మోడీ పెట్టిన గవర్నర్‌ను ఎందుకు కలిశారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. వారం రోజుల పాటు కురిసిన వర్షాలపై సీఎం కేసీఆర్ ప్రతిరోజు సమీక్షించారని ఆయన పేర్కొన్నారు. ఎక్కడా కూడా ఎలాంటి సమస్యలు రావొద్దని అధికారులకు ఆయన చేసిన ఆదేశాలతో అందరు సమిష్టి కృషితో పని చేశారని పేర్కొన్నారు.
Read Also: Suprem Court: మణిపూర్ డీజీపీకి సుప్రీం నోటీసులు.. సోమవారానికి కేసు వాయిదా
దేశంలో ఏ ప్రభుత్వం తీసుకోని విధంగా ముందే వరద నివారణ చర్యలు చేపట్టామని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. వరుసగా నాలుగేండ్ల నుంచి వరదలు వస్తున్నా కేంద్రం పై గానీ.. బీజేపీని ఒక్క మాట మాట్లాడకుండా తమ భక్తిని చాటుతూ ఆ పార్టీకి ఏజెంట్ల మాదిరిగా కాంగ్రెస్ నేతలు వ్యవహరిస్తున్నారని మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. గుజరాత్ లో రాని వరదలకు కేంద్రం నిధులు ఇస్తుంది.. కానీ తెలంగాణకు మాత్రం ఒక్క పైసా ఇవ్వడంలేదని విమర్శలు గుప్పించారు. వరుసగా వరదలపై మూడు సార్లు కేంద్ర బృందాలు వచ్చి పరిశీలించినా నయా పైసా నష్టపరిహారం ఇవ్వలేదని మంత్రి అన్నారు. దీనిపై కాంగ్రెస్ వాళ్లు మాట్లాడకుండా కేసీఆర్ పై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
