దేశానికి ధాన్యాగారంగా తెలంగాణ విలసిల్లుతోందని, అయితే కేంద్రానికి ఈ విషయంలో సోయి లేకుండా పోయిందని మండిపడ్డారు తెలంగాణ ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్ రావు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. సంకటహర చతుర్ధి సందర్భంగా గణేష్ గడ్డ దేవాలయం లో 4.5 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశాము. చాలా సంతోషం.పాశ మైలారం నుండి ORR వరకు 121 కోట్ల రూపాయలతో లింక్ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశాము. జాతీయ రహదారి పైన ట్రాఫిక్ ఒత్తిడి తగ్గుతుంది.
గతం లో వ్యవసాయ మార్కెట్ కమిటీ కోసం సీఎం కేసీఆర్ గారిని స్థానిక ఎమ్మెల్యే జిఎంఆర్ గారు కోరగానే 14 ఎకరాలు కేటాయించారు. పటాన్ చేరు మార్కెట్ ను ఆదర్శ మార్కెట్ గా తీర్చిదిద్దుతాం.. త్వరలో పటాన్ చెరు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, సంగారెడ్డి లో మెడికల్ కాలేజీని ముఖ్యమంత్రి కెసిఆర్ చేతుల మీదుగా ప్రారంభం చేస్తారు. సంగారెడ్డి, పటాన్ చెరులో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగ పట్ల దశ దిశ లేకుండా పని చేస్తుంది. బియ్యం ఎగుమతులపైన ఎందుకు నిషేధం విధించారో చెప్పాలన్నారు.
Read Also: Telangana VC Ravinder Gupta: మరోసారి వివాదంలో వీసీ.. డబ్బులు ఎగురవేస్తూ విద్యార్థులతో నృత్యాలు..
కేంద్ర మంత్రి వరి వేయిద్దు అంటున్నారు. నూకలు తినమని తెలంగాణ ప్రజలను అవమానపరుస్తున్నారు. ఆరు నెలల కింద నాలుగు సంవత్సరాలకు సరిపడా ధాన్యం నిల్వలు ఉన్నాయని ప్రకటించి, నేడు బియ్యం, నూకల ఎగుమతుల పైన ఆంక్షలు విధించడం ఎంతవరకు సబబు. కేంద్రానికి ఇంకా సోయి రావడం లేదు.. రైతులను కొడుతూ..కార్పొరేటర్లకు పంచుతున్నారు. కేంద్రం వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలి. నిషేధం తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. దేశం, ప్రపంచం తెలంగాణ వైపు చూస్తోంది. దేశానికి ధాన్యాగారం తెలంగాణ అన్నారు హరీష్ రావు. తెలంగాణలో 65 లక్షల ఎకరాల్లో వరిని సాగు చేస్తున్నారు. కేంద్ర ఇప్పటికైనా కళ్ళు తెరవాలి.
తెలంగాణలో పండిస్తున్న ప్రతి గింజను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.కేంద్రం తీరు అసంబద్దంగా వుందన్నారు. వడ్లు కొనరు.. నూకలు వద్దంటారు.. అవగాహన లేని పాలన తో ప్రజలు, రైతులకు నష్టం కలుగుతుందన్నారు. రైతు ఆదాయం ఎక్కడ పెరిగింది? దేశంలో నిల్వలు ఉంటే నిషేధం ఎందుకు పెట్టారు?భేషరతుగా ధాన్యం కొనుగోలు చేయాలన్నారు మంత్రి హరీష్ రావు. పటాన్ చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకమండలి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి హరీష్ రావు.
Read Also: Telangana VC Ravinder Gupta: మరోసారి వివాదంలో వీసీ.. డబ్బులు ఎగురవేస్తూ విద్యార్థులతో నృత్యాలు..