Kanti Velugu Programme: కంటివెలుగు సద్వినియోగం చేసుకోవాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో వివిధ దృష్టిలోపాలతో ఇబ్బందులు పడుతున్నవారికి ప్రభుత్వం శుభవార్త వినిపించింది. రాష్ట్రంలో దృష్టి లోపంతో బాధపడుతున్న వారి లోపాలను నివారించేందుకే కంటి వెలుగు కార్యక్రమాన్ని మరోమారు అమలు చేస్తున్నామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. కంటి వెలుగు కార్యక్రమం అమలు ప్రణాళికపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, జిల్లా వైద్యాధికారులతో జగిత్యాల కలెక్టరేట్ నుండి మంత్రి హరీశ్‌రావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో వైద్యారోగ్య శాఖ కమిషనర్ శ్వేత, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్, జిల్లా అదనపు కలెక్టర్ మందా మకరంద్ ప్రత్యక్షంగా పాల్గొన్నారు. హైదరాబాద్ నుంచి వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వి హాజరయ్యారు.
No Petrol Stock: సంగారెడ్డి జిల్లాలో పెట్రోల్ కొరత.. వాహనదారులకు ఇక్కట్లు
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతుందన్నారు. కంటి వెలుగు-2 కార్యక్రమాన్ని అధికారులు సీరియస్‌గా తీసుకోవాలని సూచించారు. జిల్లాల్లో కంటి వెలుగు రెండో విడత కార్యక్రమాన్ని ప్రభావవంతంగా నిర్వహించేందుకు సూక్ష్మ స్థాయి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. వచ్చే జనవరి 18న రాష్ట్ర ప్రభుత్వం కంటి వెలుగు -2 కార్యక్రమాన్ని ప్రారంభిస్తుందన్నారు. కంటి వెలుగు ద్వారా దృష్టిలోపాలను సవరించుకోవాలని మంత్రి సూచించారు.
తొలివిడత కంటి వెలుగు విజయవంతం చేసిన విధంగానే అందరినీ ఈ కార్యక్రమంలో భాగస్వాముల్ని చేయాలన్నారు మంత్రి హరీష్ రావు. ప్రజలందరికీ కంటి పరీక్షలు, అవసరం ఉన్నవారికి ఉచితంగా అద్దాల పంపిణీ చేపడతామన్నారు. పంచాయతీ, మున్సిపల్ శాఖలతో సమన్వయం చేసుకోవాలని, కంటి వెలుగు పరీక్షా కేంద్రాలకు వచ్చేవారికి అన్ని సదుపాయాలు కల్పించాలన్నారు. స్థానిక ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యంతో ముందుకు వెళ్లాలని, అధికారులు అంకితభావంతో పనిచేయాలన్నారు. కంటి వెలుగు కార్యక్రమ అమలుపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్ లు, అదనపు కలెక్టర్ లతో జిల్లా వైద్యాధికారులతో సమీక్షలో పలు సూచనలు చేశారు.
1.54 కోట్లమందికి ఉచితంగా కంటి పరీక్షలు చేయనుంది. 25 లక్షలమందికి దగ్గరి చూపు కంటి అద్దాలు, 15 లక్షలమందికి దూరం చూపు కంటి అద్దాలు, మొత్తం 40 లక్షల కంటి అద్దాలు అందించనుంది. తొలివిడత కంటివెలుగు కార్యక్రమం 2018, ఆగస్టు 15న ప్రారంభం అయి, 2019 మార్చి 31 తో ముగిసిన సంగతి తెలిసిందే. తెలంగాణ వ్యాప్తంగా సుమారు 10 వేల గ్రామాల్లో కోటి 54 లక్షలమందికి పరీక్షలు నిర్వహించారు. హైదరాబాద్ లో 8,92,256 మంది అత్యథికంగా, రంగారెడ్డి జిల్లాలో 8,60,891 మంది, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో 8,28,822 మంది పరీక్షలు చేయించుకున్నారు. కళ్ళద్దాలు 23, 41, 636 మందికి అందచేశారు. 95 శాతం లక్ష్యం సాధించారు. ఈసారి కూడా అవసరం అయిన వారికి పరీక్షలు, కంటి అద్దాలు అందించాలని భావిస్తున్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!