NTV Telugu Site icon

Harish Rao: రాబోయే ఎన్నికల్లో బీజేపీ డకౌట్, కాంగ్రెస్ హిట్ వికెట్, కేసీఆర్ సెంచరీ

Harish Rao

Harish Rao

జహీరాబాద్ లో మంత్రి హరీష్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కర్ణాటకలో అక్రమంగా డబ్బులు సంపాదించి ఇక్కడ ఖర్చు చేసి కాంగ్రెస్ పార్టీ గెలవాలని చూస్తుందని విమర్శించారు. రేవంత్ రెడ్డి మాట్లాడితే బూతులేనని.. మనకి బూతులు కావాలా..? తెలంగాణ భవిష్యత్తు కావాలా ..?అని మంత్రి హరీష్ రావు అన్నారు. కేసీఆర్ రైతుబంధు ఇస్తే బిచ్చం ఇస్తున్నారని ఎగతాళి చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ వస్తే అన్నం తినబుద్ది కావడం లేదని హీరో పవన్ కళ్యాణ్ బాధపడ్డారని గుర్తు చేశారు.
తెలంగాణ ద్రోహులంతా ఒక్కటయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Rohit Sharma: ఓ అభిమానికి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన రోహిత్ శర్మ

వికారాబాద్ లో ఓడగొట్టారని కాంగ్రెస్ అభ్యర్థి చంద్రశేఖర్ ఇక్కడికి వచ్చాడని మంత్రి హరీష్ రావు విమర్శలు చేశారు. అక్కడ చెల్లని రూపాయి ఇక్కడ చెల్లుతుందా..? అని ప్రశ్నించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో 10కి 10 సీట్లు గెలిచి కేసీఆర్ కి గిఫ్ట్ ఇద్దామని తెలిపారు. గీతారెడ్డి కాంగ్రెస్ మంత్రిగా ఉన్నప్పుడు ఏం పనులు చేయలేదని ఆరోపించారు. కేసీఆర్ అంటే నమ్మకం, విశ్వాసం అని.. కాంగ్రెస్ అంటే నయవంచన, నాటకం అని విమర్శలు చేశారు. డీకే శివకుమార్ తో ఆ శివుడు నిజాలు చెప్పిచ్చినట్టు ఉన్నాడని.. శివకుమార్ 5 గంటల కరెంట్ కామెంట్స్ తో కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టాడని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ డకౌట్, కాంగ్రెస్ హిట్ వికెట్, కేసీఆర్ సెంచరీ అని హరీష్ రావు అన్నారు.

Pawan Kalyan: నెత్తురు మరిగిన హంగ్రీ చీతా.. బ్లాక్ అండ్ బ్లాక్ లో ఏమున్నాడు

కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక పార్టీ అని మంత్రి హరీష్ రావు అన్నారు. రైతుబంధు ఆపాలని ఎలక్షన్ కమిషన్ కి కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీ రైతుకు 15 వేలు అన్నారు.. కేసీఆర్ ఎకరానికి 16 వేలు ఇస్తా అన్నారని తెలిపారు. మరోవైపు నూనె, నీళ్లు కలుస్తాయా.. బీజేపీ, బీఆర్ఎస్ కూడా ఎప్పటికి కలవవని మంత్రి పేర్కొన్నారు. కర్ణాటకలో సీఎంని మార్చాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారని.. నిన్న 25 మంది ఎమ్మెల్యేలు రహస్య సమావేశం ఏర్పాటు చేసుకున్నారని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు ఒక్కటేనని.. తెలంగాణలో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, బిజెపి మధ్య లోపాయికారి ఒప్పందం జరిగిందని మంత్రి అన్నారు. నిన్నటి వరకు బీజేపీలో ఉన్న వివేక్ కాంగ్రెస్ పార్టీలో చేరారని.. మొన్న రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారని తెలిపారు. బీజేపీలో ఉన్న నాయకులంతా కాంగ్రెస్ లో చేరుతున్నారని చెప్పారు. ఈ మధ్య కాంగ్రెస్ వాళ్లు కొన్ని కుట్రలు చేస్తున్నారని.. కొందరికి తాగించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోయినప్పుడు గొడవ చేయిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు.