NTV Telugu Site icon

Harish Rao : ప్రతి ఇంట్లో కేసీఆర్ ఉన్నడు ఈరోజు.. పథకం అందని ఇల్లు లేదు

Harish Rao

Harish Rao

ఖమ్మం జిల్లా పెనుబల్లి లో 50పడకల ఆసుపత్రికి మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఇంట్లో కేసీఆర్ ఉన్నాడు ఈరోజు.. పథకం అందని ఇల్లు లేదు.. రాజకీయాలకు అతీతంగా అమలవుతున్న సంక్షేమ పథకాలు తెలంగాణవి అని హరీష్‌ రావు అన్నారు. అంతేకాకుండా.. బీజేపీ ఎలా తయారయ్యింది అంటే.. ఢిల్లీలో అవార్డులు ఇస్తూ గల్లీ కొచ్చి తిట్టిపోతున్నారని మండిపడ్డారు. మా రైతు బంధుని కాపీ కొట్టి పీఎం కిసాన్ అంటివి.. మిషన్ కాకతీయ ని అమృత్ సరోవర్ పేరుతొ దేశం అంతటా చేస్తున్నావ్ అని ఆయన అన్నారు. ‘ఈరోజు మన ప్రభుత్వం దేశం గర్వించే విధంగా ముందుకుసాగుతుంది.. ఈ ఖమ్మం జిల్లా 10కి 10 నియోజకవర్గాలు గెలిచి కేసీఆర్ కు గిఫ్ట్ గా ఇవ్వాలి.

Also Read : Prabhakar Jaini: వెండితెరపై ‘స్వాతి బలరామ్’ విజయగాథ!

రాబోయే రెండు మూడు నెలలో సీతారామ ద్వారా గోదావరి నీళ్లు తెచ్చి మీ రెండు పంటలు పండిస్తాం అంటున్నాం. కేంద్రం ఎన్ని కోర్రీలు పెట్టిన ఆ సీతమ్మ దయ రాములోరి దయతో పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.. 6నెలల క్రితం మీకు ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు 7.5కోట్లతో కొత్త బవన నిర్మాణానికి సంఖస్తాపన చేసుకున్నాం. వైద్య ఆరోగ్య సేవలో ఎన్నో రకాల సేవలు ఈరోజు అందుతున్నాయి.. జిల్లాలో ఎందరో గొప్ప కాంగ్రెస్ నాయకులు ఉన్నా ఖమ్మం జిల్లాకు ఇప్పుడు ప్రభుత్వ మెడికల్ కాలేజి తెచ్చుకున్నాం. ఇప్పుడు కొత్తగూడెం మరియు ఖమ్మం లో మెడికల్ కాలేజి ని తెచ్చుకున్నాం.. ఈ జులై నుండి ఇక్కడ డాక్టర్ సదువు చదవవచ్చు.. తెలంగాణ రాకముందు 2950 MBBS సీట్లు ఉంటే ఇప్పుడు 20వేలు ఉన్నాయి. కాంగ్రెస్ హయం లో 20ఏళ్లకు ఒక్క మెడికల్ కాలేజి పెడితే 2ఏళ్లలో 17మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసాం.’ అని మంత్రి హరీష్ రావు అన్నారు.

Also Read : Portofino: అందమైన ప్రదేశం.. కానీ సెల్ఫీలు నిషేధం.. అతిక్రమిస్తే..