Site icon NTV Telugu

Minister Gottipati Ravi kumar: భారీ వర్షాలు.. విద్యుత్‌ శాఖ నష్టంపై మంత్రి సమీక్ష

Gottipati Ravi

Gottipati Ravi

Minister Gottipati Ravi Kumar: భారీ వర్షాల వల్ల జరిగిన విద్యుత్ శాఖ నష్టంపై అధికారులతో మంత్రి గొట్టిపాటి రవి సమీక్ష నిర్వహించారు. వీటీపీఎస్‌లోకి భారీగా వర్షపు నీరు చేరటం వల్ల 2500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడిందని మంత్రి తెలిపారు. నీటిని తోడే పనులు నిర్విరామంగా సాగుతున్నాయన్నారు. పోలవరం సైట్ నుంచి హై కెపాసిటీతో నీరు తోడే పంపులు తెప్పిస్తున్నామన్నారు. బొగ్గు మొత్తం తడిచిపోవటం వల్ల విద్యుత్ ఉత్పత్తి పునరుద్ధరించేందుకు మరో 48 నుంచి 72 గంటల సమయం పడుతుందన్నారు. విజయవాడ పరిసరాల్లో విద్యుత్ అంతరాయంపై అనేక ఫిర్యాదులు వచ్చాయని.. ఎప్పుడూ లేనంతగా రికార్డ్ స్థాయిలో అధిక వర్షం కురవడం వల్ల సబ్ స్టేషన్లు సైతం నీట మునిగాయని మంత్రి వెల్లడించారు.

Read Also: Vijayawada: చరిత్రలో ఎన్నడూ లేనంతగా.. బెజవాడలో రికార్డ్‌ వర్షం

సబ్ స్టేషన్లను పునరుద్దరిస్తూ విద్యుత్ సరఫరా చేసే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయని మంత్రి చెప్పారు. విజయవాడ నగరంలోనూ పలు చోట్ల విద్యుత్ కోతలు ఉన్నమాట వాస్తవమేనన్నారు. ఎక్కడా ప్రాణనష్టం జరగకూడదనే కొన్ని చోట్ల ముందు జాగ్రత్తగా విద్యుత్ సరఫరా నిలిపివేశామన్నారు. అధికారులు, సిబ్బంది అంతా క్షేత్రస్థాయిలోనే ఉంది ఫిర్యాదులు పరిష్కరిస్తున్నారని తెలిపారు. స్థానిక ప్రజాప్రతినిధులతోనూ మాట్లాడి వారి సూచనలకు అనుగుణంగా విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులు వేగవంతం చేశామన్నారు. శాఖాపర సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ సూచించారు.

Exit mobile version