Site icon NTV Telugu

Minister Gottipaati Ravi Kumar: వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లు బిగించే ప్రసక్తే లేదు..

Minister Gottipaati Ravi Kumar

Minister Gottipaati Ravi Kumar

Minister Gottipaati Ravi Kumar: వ్యవసాయ మోటార్లకు స్మార్ట్‌ మీటర్లు బిగించే ప్రసక్తే లేదని మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. మండలి ప్రశ్నోత్తరాల సమయంలో దీనిపై మంత్రి గొట్టిపాటి రవి కుమార్ మాట్లాడారు. గత ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల కారణంగా విద్యుత్ రంగ సంస్థలపై సుమారు రూ. 1.29 లక్షల కోట్ల భారం పడిందని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత పీపీఏల రద్దు అంశం చాలా వివాదాస్పదం అయినట్లు మంత్రి పేర్కొన్నారు. కేవలం పీపీఏల రద్దు కారణంగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన పారిశ్రామికవేత్తలు ఇతర రాష్ట్రాలకు తరలిపోయినట్లు విమర్శించారు. ప్రతీ ఏడాది వినియోగదారుల సంఖ్య 5 నుంచి 6 శాతం పెరుగుతున్నా కానీ గత ప్రభుత్వం అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో కొత్తగా ఒక్క మెగా వాట్ విద్యుత్‌ను కూడా ఉత్పత్తి చేసిన పాపాన పోలేదని విమర్శించారు. విద్యుత్‌ వ్యవస్థను గాడిన పెట్టేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. కూటమి ప్రభుత్వం గ్రీన్ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీకి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. ఇందు కోసం ఏకంగా రాష్ట్ర ప్రభుత్వం పాలసీ తీసుకొచ్చిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ఏపీ తీసుకొచ్చిన పాలసీ కారణంగా రాష్ట్రానికి పెట్టుబడులు క్రమంగా వస్తున్నాయని అన్నారు.

Read Also: AP Assembly: ఏడు కీలక బిల్లులకు ఏపీ అసెంబ్లీ ఆమోదం

గత ప్రభుత్వం తీసుకుని వచ్చిన చట్టం లోని లోపాలను సరిదిద్దే ప్రయత్నంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సుంకం (రెండో సవరణ), 2024 బిల్లు తీసుకువస్తున్నట్లు మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. ఈ సవరణ వల్ల వినియోగదారులపై కొత్తగా అదనపు భారం గానీ, విద్యుత్ సుంకం కానీ విధించడం లేదని స్పష్టం చేశారు. ఈ బిల్లును వైసీపీ ప్రభుత్వం 2021 లోనే తీసుకుని వచ్చినా… సుంకం విధించే విషయంపై ఎక్కడా స్పష్టత ఇవ్వలేదని పేర్కొన్నారు. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టే నాటికి విద్యుత్ అంతరాయాలు ఏపీలో ఎక్కువగా ఉండేవని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత నుంచి ఒక్క రూపాయి కూడా విద్యుత్ చార్జీలు పెంచకుండా పాలించిన ప్రభుత్వం తమదని మంత్రి పేర్కొన్నారు.

Exit mobile version